Homeఎంటర్టైన్మెంట్MAA Elections: ప్రకాష్...

MAA Elections: ప్రకాష్ రాజ్ నమస్కారం.. బాలక్రిష్ణ తిరస్కారం

MAA Elections Polling: ‘మా’ ఎన్నికల్లో కొందరికి ఖేదం.. కొందరికి మోదం లభించేలా కనిపిస్తోంది. రాజకీయ ఎన్నికలను తలదన్నేలా ఈసారి ‘మా’ ఎన్నికలను నిర్వహించారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వర్గాలు హోరాహోరీగా తలపడ్డాయి. నువ్వా నేనా అన్నట్టుగా విమర్శలు, ప్రతివిమర్శలతో రెచ్చిపోయారు.

prakashraj vs balaiah
prakashraj vs balaiah

‘మా’ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో చాలా విషయాలే చోటు చేసుకుంటున్నాయి. ఉదయం ప్రత్యర్థులు కౌగిలించుకుని ముచ్చట్లు చెప్పుకున్నారు. ఈ క్రమంలో విష్ణు, ప్రకాష్ రాజ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, అన్నిటికీ మించి ప్రకాష్ రాజ్ మరో అడుగు ముందుకేసి, మోహన్ బాబు కాళ్లకు మొక్కడం మొత్తానికి ఇక అంతా సుఖంతామే అనుకున్నారు. ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. కానీ ఉదయం నుంచి మిగిలిన నటీనటుల మధ్య పోరు కొనసాగుతూ వచ్చింది.

‘మా’ ఎన్నికల కేంద్రంలో ఎవరి వర్గాలు వారిని తీసుకెళ్లి ఓటు వేయించారు. దొంగ ఓట్ల కలకలం కూడా చోటుచేసుకుంది. నటుడు నరేశ్ దొంగ ఓట్లు వేస్తున్నారని ఒకరి వెంట పడడం.. ప్రకాష్ రాజ్ అడ్డుకోవడంతో ఇద్దరూ మాటా మాట పెరిగి కొట్టుకోవడానికి కూడా రెడీ అయ్యారు. పక్కనున్న వారు సర్ధి చెప్పడంతో గొడవ సద్దు మణిగింది. ఇక నటుడు బెనర్జీపై మోహన్ బాబు పోలింగ్ బూత్ లో ఏకంగా కొట్టడానికి రెడీ అయ్యి ‘చంపేస్తా’నంటూ హెచ్చరించాడు.

ఇక మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ కు సపోర్టుగా నిలిచిన బాలక్రిష్ణ ఓటు వేయడానికి వచ్చిన సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాలయ్యకు నవ్వుతూ వంగి నమస్కారాన్ని ప్రకాష్ రాజ్ పెట్టగా.. బాలక్రిష్ణ చూసినా స్పందించకుండా మొహం పక్కకు తిప్పుకొని పోవడం కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీడియాలో హైలెట్ అయ్యింది.

పోటీ తత్వం మంచిది :  Rajendra Prasad - TV9

Get notified whenever we post something new!

Continue reading

Rakul Preet Singh : ‘సూర్పనక గా రకుల్ ప్రీత్ లుక్ వైరల్.. ఇంత అందంగా ఉందేంటి..

Rakul Preet Singh : యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీ లోకి ఈమె అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ , ప్రభాస్ లతో తప్ప, టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసి...

Lamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.. ఈ ఫుట్ బాల్ ప్లేయర్ కహాని ఏంటో తెలుసా..

Lamine Yamal : అతడి వయసు జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఫుట్బాల్ ను మొత్తం దున్నేస్తున్నాడు. ప్రత్యర్థులకు అంతుచిక్కని స్థాయిలో ఆడుతున్నాడు. ఈ సీజన్లో స్పెయిన్ జట్టు విజేతగా నిలవడంలో అతడు ముఖ్యపాత్ర పోషించాడు. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. స్థిరమైన ప్రదర్శన చేసి సత్తా చూపించాడు. మైదానంలో పాదరసం లాగా...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన పెట్టుబడుల అనుకూల వాతావరణ సూచిక (Investment Friendliness Index) కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version