Homeఎంటర్టైన్మెంట్MAA elections 2021: మా'లో లొల్లి వద్దు అంటూనే శ్రీకారం చుట్టాడుగా !

MAA elections 2021: మా’లో లొల్లి వద్దు అంటూనే శ్రీకారం చుట్టాడుగా !

MAA Elections 2021

MAA Elections 2021:  మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ( MAA elections) మొదలవ్వక ముందే పార్టీలు మారిపోతున్నారు. ఈ రోజు వరకు ప్రకాష్ రాజ్ మంచోడు, అందుకే సపోర్ట్ చేస్తున్నా అంటూ కథలు చెప్పిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మొత్తానికి ప్రకాష్ రాజ్ కి ఝలక్ ఇచ్చి, ఆయన ప్యానల్‌ కు గుడ్‌ బై చెప్పేసి.. పనిలో పనిగా ఓ ప్రకటన కూడా విడుదల చేశాడు. మా ఎన్నికల్లో తన ప్యానల్ ఇది అంటూ ప్రకాష్ రాజ్ నిన్న కొంతమంది పేర్లు చేర్చి ఒక లిస్ట్ రిలీజ్ చేశాడు.

ఈ లిస్ట్ లో జీవిత రాజశేఖర్ పేరు కూడా ఉండటం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అయితే, జీవిత రాజశేఖర్ పేరుని చూసి బండ్ల బాబు అసలు తట్టుకోలేకపోతున్నాడట. మెగాస్టార్ కుటుంబాన్ని గతంలో జీవితగారు ఎన్నోసార్లు కించపరిచారని, అలాంటి ఆమెను ప్యానెల్ లో జాయిన్ చేసుకోవడం తనకు నచ్చలేదు అని బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ప్యానల్‌ నుంచి తప్పుకుంటున్నాడు. కానీ పోటీ చేస్తాడట.

ఈ క్రమంలో బండ్ల గణేష్ వరుస ట్వీట్స్ కూడా చేశాడు. బండ్ల పోస్ట్ చేస్తూ ‘మాట తప్పను … మడమ తిప్పను. నాది ఒకటే మాట -ఒకటే బాట. నమ్మడం -నమ్మినవారికోసం బతకడం. నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను – నేను ఎవరిమాట వినను. త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను – పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను…….మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు … నన్ను పోటీ చెయ్ అంటోంది.. అందుకే ఈ పోటీ… అందరికీ అవకాశం ఇచ్చారు… ఒకే ఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా ..” అంటూ బండ్ల వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు.

“వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం.. దానికోసం పోరాడతా… వారి సొంత ఇంటి కల నిజం చేస్తా.. ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు… ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు…గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు.. ఇక అలా జరగొద్దు … అందరి ఆశీస్సులు కావాలి -మా ను బలో పేతం చేద్దాం ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ళ కల నిజం చేద్దాం… అదే మా నిజమైన అభివృద్ది… చిహ్నం… ఇట్లు మీ బండ్ల గణేష్,” అని పోస్ట్ చేశాడు.

మొత్తానికి ‘మా’లో లొల్లి ఉండకూడదు అని చెప్పిన బండ్ల గణేషే మళ్ళీ లొల్లికి శ్రీకారం చుట్టినట్టు ఉన్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version