చిరంజీవిని ఎందుకు బాధ్యుడిని చేస్తున్నారు?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. హేమాహేమీలు పోటీలో ఉన్నారు. ప్రకాశ్ రాజ్ లాంటి ఉద్దండులు బాహాబాహీకి సిద్ధమయ్యారు. దీంతో చిత్రసీమలో ప్రచారం ఊపందుకుంటోంది. జీవిత, విష్ణు, హేమ లాంటి వాళ్లంతా పోటీలో ఉన్నామంటూ చెబుతున్నారు. కానీ ప్రకాశ్ రాజ్ కు మెగా కాంపౌండ్ మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ఈ విషయంలో చిరంజీవిని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సున్నితమైన అంశం. దీన్ని వేరే […]

Written By: Srinivas, Updated On : June 25, 2021 7:12 pm
Follow us on

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. హేమాహేమీలు పోటీలో ఉన్నారు. ప్రకాశ్ రాజ్ లాంటి ఉద్దండులు బాహాబాహీకి సిద్ధమయ్యారు. దీంతో చిత్రసీమలో ప్రచారం ఊపందుకుంటోంది. జీవిత, విష్ణు, హేమ లాంటి వాళ్లంతా పోటీలో ఉన్నామంటూ చెబుతున్నారు. కానీ ప్రకాశ్ రాజ్ కు మెగా కాంపౌండ్ మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది.

దీంతో ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ ఈ విషయంలో చిరంజీవిని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సున్నితమైన అంశం. దీన్ని వేరే భావంతో చూడొద్దని హితవు పలికారు. హైదరాబాద్ లోని ఎఫ్ ఎన్ సీసీలో ప్రకాశ్ రాజ్ మా బిడ్డలు ప్యానల్ ని విడుదల చేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ హఠాత్తుగా వచ్చిన ఆలోచన కాదిది అన్నారు.

ఏడాది నుంచి చూస్తున్నానని చెప్పారు. కళాకారులంతా ఒకే కుటుంబం అన్నారు. వారిలో ఎలాంటి వైషమ్యాలు ఉండకూడదని పేర్కొన్నారు. కళాకారులంటే సున్నితమైన మనసున్న వారని వివరించారు. నాపై అప్పుడే నాన్ లోకల్ అనే ముద్ర వేయడం బాధాకరంగా ఉందన్నారు. ఆర్టిస్టులు ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి చెందిన వారు కాదని చెప్పారు.

కళాకారులకు లోకల్, నాన్ లోకల్ అనే తేడాలుండవని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో అలాంటి ప్రస్దావన రావడం బాధాకరమన్నారు. తాను ఎంతో మందికి సహాయం చేసినప్పుడు రాని నాన్ లోకల్ ప్రస్తావన ఇప్పుడెందుకని ప్రశ్నించారు. జాతీయ అవార్డులు తీసుకున్నప్పుడు రాని ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.