https://oktelugu.com/

కోవాగ్జిన్ కు చుక్కెదురు.. వ్యాక్సిన్ వినియోగంపై ఎఫెక్ట్

కరోనా వైరస్ నిరోధానికి వ్యాక్సినేషన్ ఒక్కటే శరణ్యమని తెలుసు. లేకపోతే ప్రాణాలు పణంగా పెట్టుకోవాల్సి వస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ నిర్మూలనకు శాస్ర్తవేత్తలు కృషి చేస్తున్నారు. ప్రజల్లో ఇమ్యునిటీ పెంచేందుకు చర్యలు తీసుకునే క్రమంలో కోవాగ్జిన్ ప్రాధాన్యతను గుర్తించారు. కానీ భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కోవాగ్జిన్ సరఫరాకు యూఎఫ్ఎఫ్ డీఏ అంగీకరించింది. కోవాగ్జిన్ కు పూర్తిస్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అంగీకరించలేదు. క్లినికల్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 25, 2021 / 11:52 AM IST
    Follow us on

    కరోనా వైరస్ నిరోధానికి వ్యాక్సినేషన్ ఒక్కటే శరణ్యమని తెలుసు. లేకపోతే ప్రాణాలు పణంగా పెట్టుకోవాల్సి వస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్ నిర్మూలనకు శాస్ర్తవేత్తలు కృషి చేస్తున్నారు. ప్రజల్లో ఇమ్యునిటీ పెంచేందుకు చర్యలు తీసుకునే క్రమంలో కోవాగ్జిన్ ప్రాధాన్యతను గుర్తించారు. కానీ భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

    కోవాగ్జిన్ సరఫరాకు యూఎఫ్ఎఫ్ డీఏ అంగీకరించింది. కోవాగ్జిన్ కు పూర్తిస్థాయి లైసెన్స్ ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అంగీకరించలేదు. క్లినికల్ ట్రయల్స్ డేటా కావాలని భారత్ బయోటెక్ కు డీసీజీఐ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఫుల్ లైసెన్స్ పొందేందుకు మరో ఏడాది ఎదురు చూడక తప్పదని తెలుస్తోంది.ఒకరకంగా కోవాగ్జిన్ కు ఇది ఎధురుదెబ్బే.

    క్లినికల్ ట్రయల్స్ పై ఇంకా స్పష్టత రాని పరిస్థితుల్లో దాన్ని వాడేందుకు అనుమానించే ప్రమాదం ఉందని స్పష్టమవుతోంది. దీంతో బయోటెక్ లో ఆందోళన నెలకొంది. మన దేశంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను కరోనా నిరోధానికి ప్రయోగిస్తున్నారు. తాజాగా 77.8 శాతం సమర్థత ఉందంటూ డీసీబీఐకి కోవాగ్జిన్ తెలిపింది. మూడో దశ ప్రయోగాలను 25,800 మందిపై భారత్ బయోటెక్ సంస్థ డేటాను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి కోసం పంపింది.

    వ్యాక్సిన్ వినయోగంలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి తప్పనిసరి. దాని అనుమతి పైనే ఏ ఫార్మసీ ప్రొడక్ట్ అయినా వాడకం ఉంటుంది. ఇప్పటికే కోవాగ్జిన్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లేకపోవడంతో విదేశాలకు వెళ్లే వారు కోవాగ్జిన్ వేసుకునేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.