Hari Hara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న వాటిల్లో ఒకటి ‘హరి హర వీరమల్లు’. 2021 వ సంవత్సరం లో మొదలైన ఈ సినిమా కరోనా కారణంగా కొంతకాలం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల మరి కొంతకాలం ఆగిపోయింది. ఎట్టకేలకు అడ్డంకులను మొత్తం దాటుకొని ఇటీవలే మళ్లీ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమా, దాదాపుగా పూర్తి కావొచ్చింది. కేవలం నాలుగు రోజుల పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ మాత్రమే ఈ చిత్రానికి అవసరం ఉంది. ఆ తర్వాత ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేయబోతున్నారు. ఈ ఏడాది మార్చి 28 వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు టీజర్స్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అయితే కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన మొదటి పాట ‘మాట వినాలి’ ని విడుదల చేయబోతున్నాం అంటూ నిర్మాతలు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం 9 గంటలకు విడుదల అవ్వాల్సిన ఈ పాటని కొన్ని టెక్నికల్ కార్యక్రమాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందని మేకర్స్ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసారు. దీనికి అభిమానుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. నిర్మాతలు ఎన్ని సార్లు ఈ చిత్రం పట్ల వాయిదాలు వేస్తూ, సినిమా మీద ఉన్న హైప్ ని చంపేస్తారు, పవన్ కళ్యాణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలవాల్సిన సినిమాపై ఇలా చేసి ఆసక్తి పోయేలా చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే ఈ పాట ని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఆయనకీ ఎందుకో ఈ పాట ఫైనల్ మిక్సింగ్ నచ్చలేదట. ఇంకా ఎక్కువగా వర్క్ చేయాలని నిర్మాత ఏఎం రత్నం కి చెప్పినట్టు తెలుస్తుంది.
ఇది వరకే ఈ పాటకు సంబంధించిన 30 సెకండ్ల వీడియో బైట్ సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. దీనిపై అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ పాటని దయచేసి విడుదల చేయొద్దు అంటూ ఆ పాటని విన్న ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేసారు. పవన్ కళ్యాణ్ నుండి కూడా అలాంటి రియాక్షనే వచ్చినట్టు ఉంది. అందుకే వెంటనే ఆయన ఈ పాట విడుదలని ఆపమని చెప్పారట. ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన కంటెంట్స్ ఉన్నాయని, వాటితో ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని, ఇలాంటి వాటితో వద్దని ఆయన చాలా గట్టిగా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ పాట మీద మూవీ టీం మళ్లీ బలంగా వర్క్ చేసి విడుదల చేస్తారా?, లేకపోతే వేరే కంటెంట్ వదులుతారా అనేది తెలియాల్సి ఉంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా నుండి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ రాబోతుంది అనేది.