Lust Stories 2 Trailer: 2018లో విడుదలైన ఆంథాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ బిగ్ సక్సెస్. కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు చేశారు. కియారా స్వయం సంతృప్తి సన్నివేశాల్లో నటించడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. లస్ట్ స్టోరీస్ సిరీస్లో సీజన్ 2 విడుదలకు సిద్ధమైంది. జూన్ 29 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. నేడు ట్రైలర్ విడుదల చేశారు. సీజన్ వన్ అనుభవం నేపథ్యంలో లస్ట్ స్టోరీస్ 2 సైతం అడల్ట్ కంటెంట్ ప్రధానంగా సాగుతుందని అర్థం అవుతుంది.
చిన్న బండిని కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తాం, పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ అవసరం లేదా.. అనే డైలాగ్ వింటే మనకు సిరీస్ పై అవగాహన వస్తుంది. మనిషి శారీరక వాంఛల ఆధారంగా లస్ట్ స్టోరీస్ 2 రూపొందించారు. మృణాల్ ఠాకూర్, సీనియర్ హీరోయిన్ కాజోల్, తమన్నా ప్రధాన పాత్రలు చేశారు. నటుడు విజయ్ వర్మతో తమన్నా సన్నివేశాలు బోల్డ్ గా ఉన్నాయి. ట్రైలర్ పరిశీలిస్తే లస్ట్ స్టోరీస్ 2 లో తమన్నా పెళ్ళైన వ్యక్తితో శృంగారం చేస్తుంది.
తమన్నాను కౌగిలించుకున్న విజయ్ వర్మను ఆమె నెట్టేస్తుంది. నువ్వు పెళ్ళైన వాడివి, నీతో నేను శృంగారం చేయలేను అంటుంది. నేను ఎప్పటికీ నీవాడినే అని విజయ్ వర్మ కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఒకటిన్నర నిమిషం నిడివి కలిగిన లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ ఆకట్టుకుంది. డైలాగ్స్, సీన్స్ గమనించిన నేపథ్యంలో ఇది ప్యూర్ అడల్ట్ కంటెంట్. ఫ్యామిలీతో చూడలేం. తమన్నా ఈ తరహా రోల్ చేయడం ఊహించని పరిణామం. సిల్వర్ స్క్రీన్ పై తమన్నా హద్దులు దాటి శృంగారం కురిపించింది లేదు.
లస్ట్ స్టోరీస్ 2 ని అమిత్ శర్మ, కొంకణా సేన్ శర్మ, ఆర్ బాల్కి, సుజయ్ ఘోష్ రూపొందించారు. కాగా ఈ సిరీస్ చిత్రీకరణలో తమన్నా-విజయ్ వర్మ దగ్గరయ్యారు. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా వెల్లడించారు. విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నట్లు తమన్నా స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. డేటింగ్ ని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ జంట మరి పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతారో చూడాలి.
