Lucky Bhaskar Trailer Review : లక్కీ భాస్కర్ ట్రైలర్ రివ్యూ: రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి.. జీవితసత్యం చెప్పే కథ

మలయాళం లో స్టార్ హీరోగా కొనసాగుతున్న దుల్కర్ సల్మాన్.. తెలుగు చిత్రాలపై కూడా దృష్టి సారించారు. భారీగా సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇందులో భాగంగా ఆయన ముఖ్య పాత్ర పోషిస్తూ నటించిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ చిత్రంలో ఆయనకు జోడిగా మీనాక్షి చౌధురి నటిస్తోంది. ఈ చిత్రానికి అట్లూరి వెంకీ దర్శకత్వం వహిస్తున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 21, 2024 10:00 pm

Lucky Bhaskar Trailer Review

Follow us on

Lucky Bhaskar Trailer Review :అక్టోబర్ 31న దీపావళి కానుకగా లక్కీ భాస్కర్ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ సినిమా కథ మొత్తం ఓ బ్యాంక్ మేనేజర్, అతని భార్య చుట్టూ ఉంటుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. “నా పేరు భాస్కర్ కుమార్. నా వేతనం 6000. దరిద్రం బార్డర్ లైన్ లో బతికేస్తున్నా. నేను మాత్రమే కావాలని, నన్ను చేసుకుంది సుమతి. ఆమె నా భార్య. నా బలం నా సతీమణి” అంటూ దుల్కర్ సల్మాన్ వాయిస్ తో ఈ సినిమా ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత “అసలు కథ ఇప్పుడే మొదలైందని”.. దుల్కర్ సల్మాన్ చెప్పడంతో ట్రైలర్ మరో రేంజ్ కి వెళ్ళింది. ” కాలి గోటి నుంచి తల వరకు ఏది కొనుగోలు చేయాలంటే.. అది కొనేసుకో. అంత సంపాదించానని” దుల్కర్ సల్మాన్ చెప్పడంతో ఒక్కసారిగా ట్రైలర్ పై ఆసక్తి పెరుగుతుంది. అలా డబ్బు సంపాదించడానికి దుల్కర్ సల్మాన్ ఎన్నో అడ్డదారులు తొక్కాడని.. చివరికి జూదం ఆడాడని.. చెడు వ్యసనాలకు బానిసయ్యాడని.. ట్రైలర్ ద్వారా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భాస్కర్, సుమతి పాత్రల మధ్య సంఘర్షణ.. ఆ పాత్రలు అనుభవించే బాధను దర్శకుడు కళ్ళకు కట్టాడు.. కొన్ని సన్నివేశాలు చూస్తే మహానటి సినిమా గుర్తుకు వస్తోంది. మొత్తానికి రొటీన్ రొడ్డ కొట్టుడు.. ఇమేజ్ హైలెట్ చేసే సన్నివేశాలకు దూరంగా వెంకీ అట్లూరి ఈ సినిమాను తీసినట్టు కనిపిస్తోంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ రెట్రో బ్యాక్ గ్రౌండ్ ను వాడుకున్నాడు. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి మొదలుపెడితే ప్రాపర్టీ వరకు కచ్చితంగా డిజైన్ చేసుకున్నాడు. అందువల్లే సినిమా మొత్తం పాతకాలం నాటి అనుభూతిని కలిగిస్తోంది.

డబ్బు ఉంటేనే రెస్పెక్ట్

రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి” అనే డైలాగ్ ఈ సినిమా ఇతివృత్తాన్ని పూర్తిగా చెప్పేస్తోంది. డబ్బు కోసం భాస్కర్ పడ్డ బాధ.. దాన్ని సంపాదిస్తున్నప్పుడు అనుభవించిన ఆనందం.. ఆ డబ్బు వల్ల కలిగిన సంతోషాన్ని దర్శకుడు సరిగా చెప్పినట్టు కనిపిస్తోంది. డబ్బు పెరిగిన తర్వాత భాస్కర్ జీవితంలో వచ్చిన మార్పులు కూడా ఈ సినిమాకు ప్రధాన బలంగా దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. ట్రైలర్ లో నాటి కాలానికి.. నేటి సమకాలీన అంశాలను జోడించి దర్శకుడు తీసినట్టు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు.. దుల్కర్ సల్మాన్ తో పాటు మీనాక్షి చౌధురి, సచిన్ కేల్కర్ , రంగస్థలం మహేష్, సాయికుమార్, ఇతర నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. “డబ్బుంటేనే మర్యాద ప్రేమ”.. “ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా తప్పులేదని..” “జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు.. ఎప్పుడు ఆపావన్నది ముఖ్యం” వంటి డైలాగులు ప్రేక్షకులతో విజిల్ వేయించేలా ఉన్నాయి.