https://oktelugu.com/

Lucky Bhaskar Collections : లక్కీ భాస్కర్’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు..అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది..కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం!

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం మరో 80 లక్షల రూపాయిలు రాబట్టాల్సి ఉంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 6, 2024 / 09:40 PM IST

    Lucky Bhaskar Collections

    Follow us on

    Lucky Bhaskar Collections :  దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లక్కీ భాస్కర్’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి వీకెండ్ తర్వాత మాస్ సెంటర్స్ లో అనుకున్న స్థాయిలో వసూళ్లు రావడం లేదు కానీ, A సెంటర్స్ లో మాత్రం ఈ చిత్రం స్టడీ కలెక్షన్స్ తో దంచికొడుతుంది. 5 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆరవ రోజు నుండి కోటి రూపాయిల లోపే షేర్ వసూళ్లను దక్కించుకుంటుంది. 6వ రోజు 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, 7వ రోజు 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా 14 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం మరో 80 లక్షల రూపాయిలు రాబట్టాల్సి ఉంటుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసింది. వరల్డ్ వైడ్ గా 28 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమాకి మొదటి వారం లో 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ వసూళ్లను ఒక్కసారి పరిశీలిస్తే 61 కోట్ల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తుంది. దుల్కర్ నటించిన ‘సీతారామం’ చిత్రానికి తెలుగు లో ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 98 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘లక్కీ భాస్కర్’ కి ప్రస్తుతానికి అయితే ఆ స్థాయి వసూళ్లు వచ్చే అవకాశం లేదని, 35 కోట్ల రూపాయిల షేర్ వద్ద థియేట్రికల్ రన్ ని ముగించుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    ఇది ఇలా ఉండగా ప్రాంతాలవారీగా ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి వచ్చిన గ్రాస్ వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్లు, కేరళలో 11 కోట్ల 30 లక్షలు, కర్ణాటక లో 3 కోట్ల 30 లక్షలు, తమిళనాడు లో 4 కోట్ల 75 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో కోటి 20 లక్షలు, ఓవర్సీస్ లో 16 కోట్ల 20 లక్షలు, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 61 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రిటర్న్ జీఎస్టీ తో కలిపి వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే రకమైన స్టడీ కలెక్షన్స్ ని మైంటైన్ చేస్తే ఫుల్ రన్ లో 80 కోట్ల రూపాయిల మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.