Amaran Movie Collection : టార్గెట్ 66 కోట్లు..కానీ 7 రోజుల్లో ‘అమరన్’ రాబట్టిన వసూళ్లు ఎంతో తెలుసా..? కుంభస్థలం బద్దలు కొట్టడం అంటే ఇదే!

తెలుగు రాష్ట్రాల్లో కేవలం 5 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి మొదటి వారంలోనే 7 కోట్ల 75 లక్షల రూపాయిల లాభాలు వచ్చింది. ఈ వీకెండ్ తో 17 కోట్ల రూపాయిల షేర్ మార్క్ ని దాటే అవకాశం ఉంది. అదే విధంగా మిగిలిన ప్రాంతాల్లో, ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రానికి మొదటి వారం ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.

Written By: Vicky, Updated On : November 6, 2024 8:35 pm

Amaran Movie Collection

Follow us on

Amaran Movie Collections :  పెద్ద హీరోల సినిమాలను చిన్న హీరోలు అధిగమించడం వంటివి ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. సరైన కంటెంట్ తో ఎవరు సినిమా తీసిన ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘అమరన్’ అనే తమిళ చిత్రం అందుకు ఉదాహరణ. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని, ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమా కి మొదటి రోజు నుండే కళ్ళు చెదిరే వసూళ్లు బాక్స్ ఆఫీస్ వద్ద నమోదు అవుతున్నాయి. కేవలం తమిళనాడు లో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. వరుసగా వారం రోజులు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలకు తగ్గకుండా షేర్ వసూళ్లు సాధించిన ఈ చిత్రానికి మొదటి వారం లో 12 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో కేవలం 5 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి మొదటి వారంలోనే 7 కోట్ల 75 లక్షల రూపాయిల లాభాలు వచ్చింది. ఈ వీకెండ్ తో 17 కోట్ల రూపాయిల షేర్ మార్క్ ని దాటే అవకాశం ఉంది. అదే విధంగా మిగిలిన ప్రాంతాల్లో, ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రానికి మొదటి వారం ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. తమిళనాడు ప్రాంతంలో మొదటి వారం 87 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక లో 10 కోట్ల రూపాయిలు, కేరళలో 6 కోట్ల రూపాయిలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో కోటి 40 లక్షల రూపాయిలు, ఓవర్సీస్ లో 53 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల రూపాయిల గ్రాస్, 88 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

మొదటి వారంలో సూపర్ స్టార్ రజినీకాంత్, ఇలయథలపతి విజయ్ కి తప్ప ఇప్పటి వరకు ఈ స్థాయి వసూళ్లు ఏ తమిళ హీరోకి కూడా రాలేదు. విడుదలకు ముందు 67 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి, మొదటి వారం లోనే 21 కోట్ల రూపాయిల లాభం వచ్చింది. ఈ వీకెండ్ తో ఈ చిత్రం రెండు ప్రతిష్టాత్మక బెంచ్ మార్క్స్ ని దాటనుంది. తమిళనాడు లో 100 కోట్ల రూపాయిల గ్రాస్ అందులో మొదటి బెంచ్ మార్క్ కాగా, వరల్డ్ వైడ్ గా 200 కోట్ల రూపాయిల గ్రాస్ మరో బెంచ్ మార్క్. ఫుల్ రన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ వెట్టియాన్ ని దాటుతుందని, అదే విధంగా విజయ్ ‘ది గోట్’ క్లోజింగ్ కలెక్షన్స్ కి దగ్గరగా వెళ్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. మరి ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.