https://oktelugu.com/

Love Story Movie: చైతు రాడు.. భయంలో లవ్ స్టొరీ నిర్మాతలు !

Love Story Movie: అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)ల ‘లవ్ స్టోరీ’ సినిమా ఎప్పుడో పూర్తయింది. అలాగే ఎప్పుడో విడుదల కావాలి. కానీ, అనేక కారణాల వల్ల ఇంకా రిలీజ్ కాలేదు. అయితే నాగ చైతన్య – శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తోన్న మొదటి సినిమా.. పైగా సాయి పల్లవితో చైతు చేస్తోన్న మొదటి సినిమా కూడా. కాబట్టి.. సహజంగానే ఈ సినిమాకి భారీ బజ్ […]

Written By:
  • admin
  • , Updated On : September 8, 2021 / 04:40 PM IST
    Follow us on

    Love Story Movie: అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)ల ‘లవ్ స్టోరీ’ సినిమా ఎప్పుడో పూర్తయింది. అలాగే ఎప్పుడో విడుదల కావాలి. కానీ, అనేక కారణాల వల్ల ఇంకా రిలీజ్ కాలేదు. అయితే నాగ చైతన్య – శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తోన్న మొదటి సినిమా.. పైగా సాయి పల్లవితో చైతు చేస్తోన్న మొదటి సినిమా కూడా. కాబట్టి.. సహజంగానే ఈ సినిమాకి భారీ బజ్ క్రియేట్ అయింది. నిజానికి గత వారమే ఈ సినిమా ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంది.

    కానీ, ప్రెస్ మీట్ కి చైతు ఇంట్రెస్ట్ గా లేడు. గత కొన్ని రోజులుగా నాగ చైతన్య వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సమంతతో చైతు విడిపోతున్నాడు అనేది ఆ వార్త సారాంశం. దాంతో ‘లవ్ స్టోరీ’ ప్రెస్ మీట్ పెడితే.. మీడియా వాళ్ళు చైతుతో సమంత మ్యాటర్ గురించి అడుగుతారు. అది చైతుకి ఇష్టం లేదు.

    అందుకే, చైతు ప్రెస్ మీట్ కి రావడానికి ఆసక్తి చూపించడం లేదు. హీరోనే రాకపోతే నెగిటివ్ టాక్ బయటకు వెళ్తుంది అని నిర్మాతలు భయపడుతున్నారు. ఒకవేళ రిస్క్ చేసి ఈ నెలాఖరులో ‘లవ్ స్టోరీ’ని రిలీజ్ చేస్తే.. నాగ చైతన్య కచ్చితంగా మీడియా ముందుకు రాడు. ఇప్పుడు నిర్మాతలకు ఇదే భయం పట్టుకుంది.

    సరే.. సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేద్దాం అంటే.. ఇప్పటికే సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు కూడా మళ్ళీ సినిమా రిలీజ్ మరింత ఆలస్యం అయితే, అసలకే ప్రమాదం జరగవచ్చు. అందుకే ఇక చేసేది ఏమి లేక ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ ను అలాగే సినిమా ప్రమోషన్ ను ఆపేశారు మేకర్స్.

    మరీ లవ్ స్టోరీ సినిమా విడుదల తేదీ ఎప్పుడు ఉంటుంది ? శేఖర్ కమ్ముల ‘ఫిదా’ లాంటి సంచలన విజయం తర్వాత చేస్తున్న సినిమాకి ఇన్ని అడ్డంకులు రావడం బాధాకరమైన విషయమే.