Love Story Collections: కూల్ హీరో నాగచైతన్య క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ మంచి హిట్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ లో భారీ కలెక్షన్స్ ను రాబట్టి, ప్రస్తుతం ఫుల్ లాభాల దిశగా సాగుతోంది. మరి ఈ సినిమా 10వ రోజు ఎక్కడ ఎంత వసూలు చేసింది చూద్దాం.

నైజాంలో – రూ. 49 లక్షలు,
సీడెడ్‌లో – రూ. 21 లక్షలు,
ఉత్తరాంధ్రలో – రూ. 12 లక్షలు,
ఈస్ట్ గోదావరిలో – రూ. 6 లక్షలు,
వెస్ట్ గోదావరిలో – రూ. 5 లక్షలు,
గుంటూరులో – రూ. 6 లక్షలు,
కృష్ణాలో – రూ. 6 లక్షలు,
నెల్లూరులో – రూ. 5 లక్షలు వచ్చాయి.
దీంతో ఈ సినిమాకి పదో రోజు కూడా రూ. 1.10 కోట్లు షేర్, రూ. 1.82 కోట్లు గ్రాస్ వచ్చింది. చైతు కెరీర్ లోనే ఇది రికార్డు. సహజంగా చైతు సినిమాలకు ఫస్ట్ వీక్ తో బాక్సాఫీస్ మూతపడిపోతుంది. కానీ లవ్ స్టోరీ విషయంలో మాత్రం సెకెండ్ వీక్ లో కూడా చైతు సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుండటం నిజంగా విశేషమే.
ఇక ‘లవ్ స్టోరి’ సినిమాకి మొత్తం 10 రోజులకు కలిపి ఎంతవరకు కలెక్షన్స్ వచ్చాయంటే..
నైజాంలో – రూ. 11.64 కోట్లు,
సీడెడ్‌లో – రూ. 4.09 కోట్లు,
ఉత్తరాంధ్రలో – రూ. 2.79 కోట్లు,
ఈస్ట్ గోదావరిలో – రూ. 1.49 కోట్లు,
వెస్ట్ గోదావరిలో – రూ.1.25 కోట్లు,
గుంటూరులో – రూ. 1.44 కోట్లు,
కృష్ణాలో – రూ. 1.26 కోట్లు,
నెల్లూరులో – రూ. 82 లక్షలు
మొత్తం ఈ సినిమాకి ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ రూ. 24.78 కోట్లు షేర్, రూ. 40.30 కోట్లు గ్రాస్ గా ఉంది.
ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా లవ్ స్టోరీ’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది.
కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో – రూ. 1.70 కోట్లు,
ఓవర్సీస్‌లో – రూ. 4.72 కోట్లు వసూలు చేసింది.
ఇక మొత్తం కలుపుకుంటే లవ్ స్టోరీకి మొదటి పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.20 కోట్లు షేర్, అదే గ్రాస్ రూపంలో చూసుకుంటే రూ. 55.30 కోట్లు వచ్చాయి. మొత్తానికి ‘లవ్ స్టోరీ’ సినిమాకి భారీ లాభాలు వచ్చాయి.