Teenmaar Mallanna Case: క్యూ న్యూస్ చానల్ అధినేత, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. మల్లన్న భార్య మాతమ్మ వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. తీన్మార్ మల్లన్నపై ఒకే కారణంతో పోలీసులు అనేక కేసులు నమోదు చేయడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయన్ను దాదాపు నెలకు పైగా జైల్లోనే ఉంచింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య పిటిషన్ తో కేసులో కదలిక వచ్చింది. ఏదైనా కేసులో మళ్లీ అరస్టు చేయాలంటే పోలీసులు డీజీపీ అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ఎట్టకేలకు మల్లన్న కేసులో మరో ముందడుగు పడింది. న్యాయస్థానం ఆదేశంతో మల్లన్న విడుదలకు మార్గం సుగమం అయినట్లే అని తెలుస్తోంది. ప్రభుత్వం కావాలనే దురుద్దేశంతోనే జైలులో పెట్టిందని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడైంది. దీంతో ఆయనను ప్రభుత్వం అక్కరకు రాని కేసులు పెట్టించి లోపలికి పంపించడంపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తం అయింది.
తీన్మార్ మల్లన్నపై కేసుల విచారణ ఇకపై డీజీపీ పర్యవేక్షణలో చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు నమోదు చేశాక 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చాక విచారణ చేపట్టాలని సూచించింది. దీంతో కోర్టు చెప్పిన విధంగా నడుచుకోవాలని తెలిపింది. దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆదేశించింది.
తీన్మార్ మల్లన్నపై ఉన్న 35 కేసులకు సంబంధించి న్యాయవాది దిలీప్ సుంర వాదనలు వినిపించారు. మల్లన్న బెయిల్ పిటిషన్ పై రేపు మరోమారు వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మల్లన్నపై ఇన్న కేసులు పెట్టి ప్రభుత్వం కావాలనే బాధ్యుడిని చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వ విధానం వివాదాస్పదంగా కనిపిస్తోంది.