Arohi Rao-RJ Surya: బిగ్ బాస్ హౌస్ లో ఒక ప్రేమకథ మొదలైనట్లు తెలుస్తుంది. రెండు వారాలు గడుస్తున్నా రొమాంటిక్ యాంగిల్ మిస్సై నిరాశపడుతున్న ప్రేక్షకుల కోరిక తీరనునట్లు హింట్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ ఆరోహిరావు, ఆర్జే సూర్య ప్రేమికులుగా అవతరించినట్లు అభినయశ్రీ కుండబద్దలు కొట్టింది. బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ అనేది సక్సెస్ ఫార్ములా. హౌస్ లో ప్రేమాయణం నడిపినోళ్లు కొందరు టైటిల్స్ కూడా ఎగరేసుకుపోయారు. అందమైన అమ్మాయితోనో అబ్బాయితోనో ఎఫైర్ పెట్టుకుంటే ఫుల్ మైలేజ్. వారాల తరబడి హౌస్ లో ఉండే ఛాన్స్ దక్కుతుంది. నిర్వాహకులతో పాటు ప్రేక్షకులు వాళ్లకు మంచి ప్రోత్సాహం ఇస్తారు.

సింగర్ రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి, అఖిల్ సార్థక్-మోనాల్, అభిజీత్-అలేఖ్య హారిక బిగ్ బాస్ ప్రేమ పక్షులుగా పిచ్చ పాపులారిటీ సంపాదించారు. వీరిలో సింగర్ రాహుల్, అభిజీత్ టైటిల్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే సీజన్ 5లో ఫ్రెండ్స్ పేరుతో షణ్ముఖ్ జస్వంత్-సిరి నాన్ స్టాప్ రొమాన్స్ కురిపించారు. ఒకే బెడ్ పై పడుకోవడంతో పాటు ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. వీరిద్దరి మధ్య గిల్లికజ్జాలు మరో ఆకర్షణ. తిట్టుకోవడం బ్రతిమిలాడు కోవడం కామన్ ప్రక్రియగా ఉండేది. ఇక షణ్ముఖ్-సిరి ఫైనల్ కి చేరిన విషయం తెలిసిందే.
కాగా సీజన్ 6 మొదలై రెండు వారాలు గడుస్తున్నా ప్రేమజంటలు ఏర్పడలేదు. బిగ్ బాస్ హౌస్ లో ఈ యాంగిల్ ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. అయితే ఆరోహిరావు-ఆర్జే సూర్య మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యిందని తెలుస్తుంది. బిగినింగ్ నుండి చాలా సన్నిహితంగా ఉంటున్న వీరిద్దరి మధ్య స్నేహానికి మించి సంథింగ్ సంథింగ్ మొదలైందంటున్నారు. ఆదివారం ఎపిసోడ్ లో ఈ విషయం చర్చకు వచ్చింది. నాగార్జున వీరిద్దరిని నిలదీశాడు. మీ మధ్య ఏదో నడుస్తుంది అన్నాడు .

నాగార్జున మాటలకు అభినయశ్రీ స్పందించారు. ఆరోహిరావు-ఆర్జే సూర్య ఒకరినొకరు ఇష్టపడుతున్నారనడంలో సందేహం లేదన్నారు. నేను కూడా గమనించాను. ఆరోహిరావు-ఆర్జే సూర్య ప్రేమించుకుంటున్నారని అభినయశ్రీ స్ట్రాంగ్ చెప్పారు. అయితే ఆరోహిరావు ఈ ఆరోపణలు ఖండించారు. మూడేళ్ల పరిచయంలో కలగని ప్రేమ ఈ రెండు వారాల్లో ఏం కలుగుతుంది సార్… అలాంటిదేమీ లేదు. మేము జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. ఆరోహిరావు-ఆర్జే సూర్య మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. ఇక ఈ వారం డబల్ ఎలిమినేషన్ జరిగింది. షాని, అభినయశ్రీ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.
Also Read: Pawan Kalyan Janasena: జనసేన నిలిచి, గెలిచే సీట్లు ఎన్ని? పవన్ దీమాకు కారణాలేంటి?



[…] […]
[…] […]