https://oktelugu.com/

Kerala Auto Driver: ఆ ఆటో డ్రైవర్ కు రూ.25 కోట్లు వచ్చాయి.. ఎలానో తెలిస్తే షాక్ అవుతారు !

Kerala Auto Driver: కేరళలోని ఓ ఆటోడ్రైవర్‌ నక్క తోకను తొక్కాడు. అదృష్ట దేవత అతడిని లాటరీ రూపంలో కరుణించింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. మొత్తానికి ఆ ఓనం బంపర్ లాటరీతో ఆ నిరుపేద ఇంట్లో నిజంగానే పెద్ద పండగనే తీసుకొచ్చింది. ఇంతకీ ఎవరు అతను ?, తిరువనంతపురం శ్రీవరాహం ప్రాంతంలో నివసించే 32 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్ అనూపే అతను. రూ.25 కోట్ల మెగా బహుమతిని సొంతం చేసుకున్న వ్యక్తి ఇతనే. నిజానికి […]

Written By:
  • Shiva
  • , Updated On : September 19, 2022 / 11:44 AM IST
    Follow us on

    Kerala Auto Driver: కేరళలోని ఓ ఆటోడ్రైవర్‌ నక్క తోకను తొక్కాడు. అదృష్ట దేవత అతడిని లాటరీ రూపంలో కరుణించింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. మొత్తానికి ఆ ఓనం బంపర్ లాటరీతో ఆ నిరుపేద ఇంట్లో నిజంగానే పెద్ద పండగనే తీసుకొచ్చింది. ఇంతకీ ఎవరు అతను ?, తిరువనంతపురం శ్రీవరాహం ప్రాంతంలో నివసించే 32 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్ అనూపే అతను. రూ.25 కోట్ల మెగా బహుమతిని సొంతం చేసుకున్న వ్యక్తి ఇతనే.

    Kerala Auto Driver

    నిజానికి అనూప్ తొలుత ఓ లాటరీ టికెట్ ఎంచుకున్నాడు. అది నచ్చక మరో టికెట్ తీసుకున్నాడు. ఇప్పుడా రెండో టికెట్ కు ఏకంగా రూ.25 కోట్ల జాక్ పాట్ తగిలింది. ఇది అదృష్టం కాక మరేమిటి! ట్యాక్స్ లు అన్నీ పోను ఆ ఆటోడ్రైవర్ కు రూ.15 కోట్ల వరకు వస్తాయి. మరి ఆ వచ్చిన డబ్బుతో ఏం చేస్తావ్ ? అని అడిగితే.. మంచి ఇల్లు కట్టుకుంటానని, అప్పులన్నీ తీర్చేస్తానని అనూప్ చెప్పుకొచ్చాడు.

    Also Read: Icon Star Allu Arjun: ముక్కు ముఖం తెలియని హీరోయిన్ కి పాన్ ఇండియా స్టార్ బన్నీ క్షమాపణలు… అసలు ఏం జరిగింది!

    పైగా మనోడు సామాజిక సాయం కూడా చేస్తాడట, అయితే ముందుగా బంధువులకు సాయం చేసి, ఆ తర్వాత సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడతానని వెల్లడించాడు. అంతేకాదు, ఇక మలేసియా వెళ్లనని, కేరళలోనే ఉంటానని తెలిపాడు. అనూప్ కి ఎప్పటి నుంచో లాటరీల పిచ్చి ఉంది. ఎప్పటికైనా దశ తిరగకపోతుందా అని గత 22 ఏళ్లుగా లాటరీలు కొంటున్నాడు. అది ఇన్నాళ్లకు పని చేసింది.

    ఇది పని చేయకపోతే అనూప్ మలేసియా వెళిపోయేవాడు. అనూప్ కి వంటల్లోనూ ప్రావీణ్యం ఉంది. అందుకే చెఫ్ గా పనిచేసేందుకు మలేసియా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం బ్యాంకులో రూ.3 లక్షల లోన్ కోసం అప్లై చేసుకున్నాడు. ఈ క్రమంలో టికెట్ కొన్నాడు. ఆ టికెట్ అనూప్ జీవితాన్ని మార్చివేసింది.

    Also Read: KCR Vs BJP: బీజేపీకి కేసీఆర్ చెక్ పెడతారా..మైండ్ గేమ్ మేకర్ కేసీఆర్..

    Tags