Cheetahs: మనిషిని పోలిన మనిషులు ఏడుగురు ఉన్నట్టే.. చిరుతలను పోలిన చీతాలు చాలానే ఉంటాయి. మనదేశంలో చాలా చిరుతలే ఉన్నాయి. కానీ చీతాలే లేవు. అందుకే వాటిని నమీబియా నుంచి తీసుకొచ్చారు. 1952 లోనే దేశంలో చిరుతలు అంతరించిపోయాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ చిరుతలు, చీతాలు ఒకటి కాదు. రెండు కూడా పిల్లి జాతికి చెందినవే. కానీ ఎన్నో వైరుధ్యాలు. ఇంతకీ అవి ఎన్ని రకాలు, వాటి శరీర తీరు, వేటాడే విధానం వేటికవే విభిన్నం. నమిబియా నుంచి చీతాలు భారతదేశానికి వచ్చిన నేపథ్యంలో మరొకసారి వాటిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
..
పెద్దపులి
ధైర్యానికి మారుపేరుగా, వేటాడే విధానానికి ఐకానిక్ సింబల్ గా పెద్దపులిని చెబుతుంటారు. ఇది 70 నుంచి 300 కిలోల వరకు ఉంటుంది. ఇది భారతదేశం, బంగ్లాదేశ్, మలేషియా, దక్షిణ కొరియా దేశంలో కనిపిస్తున్న ఈ జాతి.. త్వరలో అంతరించిపోయే దశకు చేరుకుంది.
…
జాగ్వర్
అడవుల్లో ఇది పరిగెత్తే విధానం చూసి జాగ్వర్ వాహనాన్ని ప్రవేశపెట్టారు. 50 నుంచి 110 కిలోల బరువు ఉంటుంది. ఇది అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని పంజా దెబ్బ పిల్లి జాతుల్లో కల్లా తీవ్రమైనది. ఒక చిన్నపాటి ఏనుగుని సైతం ఇది ఒక్క పంజా దెబ్బతో మట్టు పెట్టగలదు. ఒక్కోసారి దీని వేగం సుడిగాలిని తలపిస్తూ ఉంటుంది.
..
చీతా
..
ఇది 33 నుంచి 56 కిలోల వరకు బరువు ఉంటుంది. సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్న జంతువును కూడా ఇది సులభంగా చూడగలదు. దీని పంజా దెబ్బ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే క్షీర దం. వీటి వల్ల మనుషులకు పెద్దగా అపాయం ఉండదు. ఇవి కేవలం పగటిపూట మాత్రమే వేటాడుతాయి.
..
కూగర్
..
ఇవి 40 నుంచి 100 కిలోల వరకు బరువు ఉంటుంది. ఇది చూసేందుకు సింహం లాగా కనిపిస్తుంది. ఒంటిపై ఎటువంటి చారలు ఉండవు. పర్వత ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది కాబట్టి దీనిని హిల్ క్యాట్ అని పిలుస్తుంటారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితిని అయినా ఈ జాతి తట్టుకోగలదు. జంతువు ఎంత పెద్దదైనా వేటాడేందుకు కూగర్ వెనుకాడదు. నీళ్లల్లో ఉండే మొసలిని సైతం వేటాడి చంపి తినగలిగే తెగువ ఈ జాతి సొంతం.
..
చిరుత
..
ఈ 30 నుంచి 90 కిలోల వరకు బరువు ఉంటుంది. ఇది చూసేందుకు జాగ్వర్ లాగే కనిపిస్తుంది. కానీ దీని ఒంటిపై చిన్న చిన్న మచ్చలు ఉంటాయి. అవి చూసేందుకు నల్లని కోటు మాదిరి కనిపిస్తాయి. ఇవి ఆసియా నుంచి ఆఫ్రికా ఖండం వరకు విస్తరించి ఉన్నాయి. ఆఫ్రికా దేశంలో నివసించే ఈ చిరుతలు పులి కంటే మెరుగుగా ఇతర జంతువులను వేటాడగలవు.
..
మంచు చిరుత
..
ఇది 25 నుంచి 55 కిలోల వరకు బరువు ఉంటుంది. సెంట్రల్, దక్షిణాసియాలోని మంచు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి చాలా పొడవైన తోక ఉంటుంది. ఎదుటి జంతువును వేటాడటంలో ఆ తోకను ఉపయోగించుకుంటుంది. హిమ పర్వతాలలో చాలా చాకచక్యంగా వేటాడుతూ ఉంటుంది. లద్ధాఖ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు మంచు చిరుతను తమ రాష్ట్రీయ జంతువుగా ప్రకటించాయి.
..
చీతాల అభివృద్ధి కోసమే
..
చీతాలు అంతరించిపోయిన తర్వాత ప్రభుత్వం 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టం తీసుకొచ్చింది. దీనివల్ల అరుదైన జాతులను కాపాడే సౌలభ్యం పెరిగింది. ఇప్పటివరకు దేశంలో సుమారు 72 జాతులకు ఆయుషు పోశారు. మిగతా వాటిపైన ప్రయోగాలు జరుగుతున్నాయి. సీసీఎంబి శాస్త్రవేత్తలు కూడా విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నమిబియా నుంచి తీసుకొచ్చిన చీతాల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రభుత్వం అంటున్నది. అయితే ఇన్నాళ్లు చీతాలు లేకుంటే మాత్రం ఏమైంది? ఇప్పుడు వాటిని తీసుకొచ్చి అంత హంగామా చేయాల్సిన అవసరం ఏంటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ అడవి అన్నాక కొన్ని జంతువులు మాత్రమే కాదు అన్ని జంతువులు ఉండాలి. అప్పుడే జీవవైవిద్యం అనే పదానికి పూర్తి సార్ధకత లభిస్తుంది.