https://oktelugu.com/

8 కోట్ల వరకూ నష్టాలు.. బయ్యర్లు అసంతృప్తి !

యంగ్ హీరోగా కనిపించినా.. నితిన్ చాలా సీనియర్ హీరోనే. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే హీరోగా హిట్ అందుకున్న ట్రాక్ రికార్డ్ నితిన్ ది. పైగా రాజమౌళి, త్రివిక్రమ్ నుంచి వెంకీ కుడుముల వరకూ మంచి మంచి డైరెక్టర్స్ తో సినిమాలు చేశాడు నితిన్. కానీ, ఇప్పటికీ కన్సిస్టెంట్ గా హిట్స్ ఇవ్వలేకపోతున్నాడు. దాంతో నితిన్ సినిమాలకు నమ్మకమైన ఓపెనింగ్స్ రాకుండా పోతున్నాయి. ‘ఇష్క్’, ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ సినిమాలతో నితిన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి […]

Written By:
  • admin
  • , Updated On : March 1, 2021 / 05:13 PM IST
    Follow us on


    యంగ్ హీరోగా కనిపించినా.. నితిన్ చాలా సీనియర్ హీరోనే. దాదాపు రెండు దశాబ్దాల క్రితమే హీరోగా హిట్ అందుకున్న ట్రాక్ రికార్డ్ నితిన్ ది. పైగా రాజమౌళి, త్రివిక్రమ్ నుంచి వెంకీ కుడుముల వరకూ మంచి మంచి డైరెక్టర్స్ తో సినిమాలు చేశాడు నితిన్. కానీ, ఇప్పటికీ కన్సిస్టెంట్ గా హిట్స్ ఇవ్వలేకపోతున్నాడు. దాంతో నితిన్ సినిమాలకు నమ్మకమైన ఓపెనింగ్స్ రాకుండా పోతున్నాయి. ‘ఇష్క్’, ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ సినిమాలతో నితిన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు.

    Also Read: నిర్మాతగా మారబోతున్న స్టార్ బ్యూటీ !

    ఈ క్రమంలో త్రివిక్రమ్ తీసిన ‘అ ఆ’ పెద్ద హిట్ అవ్వడంతో ఆ సినిమా నితిన్ కెరీర్ కే పెద్ద మలుపు అయింది. కాకపోతే అంత పెద్ద హిట్ వచ్చినా అదే ఊపుని మాత్రం నితిన్ కంటిన్యూ చెయ్యలేక వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. గతేడాది ‘భీష్మ’ సినిమాతో మరోసారి భారీ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడైనా గ్యాప్ లేకుండా విజయాలు అందిస్తాడనుకుంటే… ‘చెక్’ సినిమాతో సేమ్ స్టోరీ రిపీట్ అవ్వడంతో నితిన్ మార్కెట్ పై అనుమానాలు మొదలైయ్యాయి.

    Also Read: వైదొలిగిన నాగార్జున.. అన్ని కోట్ల డీల్ వద్దన్నాడట..

    నిజానికి గత వీకెండ్ విడుదలైన ‘చెక్’ మూడు రోజుల్లోనే ఏడున్నర కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఏడు కోట్లు తర్వాత నుండి ఈ సినిమాకి కలెక్షన్స్ పూర్తిగా పడిపోయాయి. కేవలం మరో రెండు కోట్ల కంటే రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చేతులు ఎత్తేసింది. చెక్ దాదాపు 18 కోట్లకు వ్యాపారం జరిగింది. అంటే ఎనిమిది కోట్ల వరకు థియేటర్లో లాస్ అన్నమాట. దీంతో బయ్యర్లు బాగా అసంతృప్తిలో ఉన్నారు. నితిన్ ఇప్పటికైనా కెరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోక హీరోగా కొనసాగడం కష్టమే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్