హైదరాబాద్-విజయవాడ హైవేపై నరకం.. అటు వెళ్లొద్దు

జనాలు పెరుగుతున్నారు. ఆదాయాలు పెరుగుతున్నాయి. కానీ దానికి అనుగుణంగా మౌలిక వసతులు మాత్రం పెరగడం లేదు. పదేళ్ల కిందటి రోడ్లే ఇప్పుడు ఉన్నాయి. వాహనాలు పెరగడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. వందల వాహనాలు రోడ్డు ఎక్కితే అన్నీ ట్రాఫిక్ జామ్ లో పడిపోయి భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. సూర్యాపేట జిల్లాలోని గొల్లగట్ట జాతర నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. సూర్యపేటకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లగట్టు జాతర […]

Written By: NARESH, Updated On : March 1, 2021 5:11 pm
Follow us on

జనాలు పెరుగుతున్నారు. ఆదాయాలు పెరుగుతున్నాయి. కానీ దానికి అనుగుణంగా మౌలిక వసతులు మాత్రం పెరగడం లేదు. పదేళ్ల కిందటి రోడ్లే ఇప్పుడు ఉన్నాయి. వాహనాలు పెరగడంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. వందల వాహనాలు రోడ్డు ఎక్కితే అన్నీ ట్రాఫిక్ జామ్ లో పడిపోయి భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది.

సూర్యాపేట జిల్లాలోని గొల్లగట్ట జాతర నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.

సూర్యపేటకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లగట్టు జాతర ప్రదేశానికి వెళ్లాలంటే సుమారు గంటన్నర సమయం పడుతోందని వాహనచోదకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో విజయవాడ వైపునకు వెళ్లే భారీ వాహనాలను నార్కెట్ పల్లి వద్ద దారి మళ్లిస్తున్నారు. జాతర సందర్భంగా ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాల తాకిడి ఎక్కువగా ఉంది.

ప్రస్తుతం పెద్దగట్టు నుంచి సువేన్ ఫ్యాక్టరీ వరకు సుమారు 2 కి.మీ మేర వాహనాలు బారులు తీరాయి. నేటి నుంచి ప్రారంభమైన గొల్లగట్టు జాతర నాలుగురోజుల పాటు కొనసాగనుంది.