Lokesh Kanagaraj and Rajinikanth : పాన్ ఇండియా లో లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్స్ లో ఒకరు లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj). సందీప్ కిషన్ తో ‘నగరం’ అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయమైన లోకేష్, ఆ తర్వాత కొన్నాళ్ళకు తమిళ హీరో ‘కార్తీ’ తో చేసిన ‘ఖైదీ’ చిత్రం తో సౌత్ లో ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఆయన ‘మాస్టర్’,’విక్రమ్’, ‘లియో’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిల్చిపోయాడు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) తో చేసిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం ఆగస్టు 14 న అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యి చాలా రోజులైంది.
Also Read : ఐశ్వర్య రాయ్ తో నటించినందుకు రజినీకాంత్ ఇన్ని అవమానాలు ఎదురుకున్నాడా?
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వాయు వేగంతో జరుగుతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే లోకేష్ కనకరాజ్ పెట్టిన ఒక ట్విట్టర్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘కూలీ మూవీ ప్రొమోషన్స్ మొదలయ్యే వరకు సోషల్ మీడియా కి దూరం గా ఉండాలని అనుకుంటున్నాను, కలుసుకుందాం, అప్పటి వరకు సెలవు’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే దీని అర్థం ఏమిటి?, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో బిజీ గా ఉండడం వల్ల లోకేష్ ఇలా చెప్పాడా?, లేకపోతే పని మొత్తం పూర్తి అవ్వడంతో విశ్రాంతి అని చెప్పేందుకే ఇలా చేశాడా?, మరి టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారు?, టీజర్ ని విడుదల చేసిన తర్వాత గ్యాప్ తీసుకోవచ్చు కదా, ఈ సినిమా కంటెంట్ గురించి ఆడియన్స్ కి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. రజినీకాంత్ ఇందులో ఒక దొంగ అని మాత్రమే తెలుసు.
ఇకపోతే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున నెగెటివ్ క్యారక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్ మొత్తం మీద మొట్టమొదటి నెగెటివ్ రోల్ ఇది. షూటింగ్ సమయంలో నాగార్జునకు సంబంధించిన ఒక వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో లో నాగార్జున వయొలెన్స్ ని చూసి అభిమానులు ‘విక్రమ్’ లోనే రోలెక్స్ పాత్ర ని మించిపోయింది అంటున్నారు ఫ్యాన్స్. అదే విధంగా ఈ చిత్రం లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నాడు, అదే విధంగా ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరైన అమీర్ ఖాన్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, పూజ హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. ఇలా ఇన్ని విశేషాలతో తెరకెక్కిన ఈ సినిమా తమిళ ఇండస్ట్రీ కి మొట్టమొదటి వెయ్యి కోట్ల సినిమా అవుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : నెల్సన్ vs లోకేష్ కనకరాజ్ ఈ ఇద్దరిలో ఎన్టీఆర్ తో సినిమా చేసేది ఎవరు..?