Little Hearts Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కొత్త దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నారు… రీసెంట్ గా ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు సాయి మార్తాండ్…ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 25 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. మరి ఇలాంటి క్రమంలోనే మొదట సాయి మార్తాండ్ ఈ సినిమాని 10 లక్షల బడ్జెట్లో చేయాలనుకున్నాడట. తన ఫ్రెండ్ ద్వారా 10 లక్షల రూపాయలను రెడీ చేసుకొని ఈ సినిమాను చేసి ఓటిటి లో రిలీజ్ చేయాలని అనుకున్నారట. తను మొత్తానికైతే ఈ కథ ను ఈటీవీ విన్ వాళ్లకి చెప్పి వాళ్ళని ఒప్పించాడు. ఇక దాంతో ఈ కథ 90స్ డైరెక్టర్ అయిన ఆదిత్య హాసన్ దగ్గరికి వెళ్లడంతో ఇమిడియట్ గా తను ఈ కథను ఓకే చేసి తనే ప్రొడ్యూస్ చేశాడు. ఇక మొత్తానికైతే 10 లక్షలు చేయాలనుకున్న ఈ సినిమా 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందని రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
మరి మొత్తానికైతే ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. మరి తను అనుకున్నట్టుగానే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన మొత్తానికైతే ఇప్పుడు దర్శకుడిగా మారి సూపర్ సక్సెస్ ని సాధించడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…
ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయన వెను తిరిగి చూడకుండా భారీ సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలనే ధృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు… మరి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకోవడానికి కొత్త దర్శకులు విపరీతమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. కానీ కథల్లో కొత్తదనం ఉన్న వాళ్లను మాత్రం ఇండస్ట్రీ ఎప్పుడు ఆదరిస్తుందనే చెప్పాలి.
ఇక ప్రేక్షకులు సైతం అలాంటి సినిమాలకే పట్టం కడుతున్నారు… సాయి మార్తాడు అదృష్టం బాగుండి 10 లక్షల్లో చేయాల్సిన సినిమాకి ఎక్కువ రీచ్ దొరికి రెండు కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించి డైరెక్ట్ గా థియేటర్లో రిలీజ్ చేశాడు… ఇక ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో ఆ బ్యానర్ లోనే మరో సినిమా చేయడానికి కమిట్ అయినట్టుగా తెలుస్తోంది…