Little Hearts Movie Collections: ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక శాతం సక్సెస్ రేట్ మన టాలీవుడ్ కి చిన్న సినిమాల ద్వారానే వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలు మొత్తం ఒక్కొక్కటిగా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ రాగా, కేవలం చిన్న సినిమాలే ఇండస్ట్రీ కి కాస్త ఊపిరి పోస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం అందుకు ఒక ఉదాహరణ. యూట్యూబ్ లో స్టాండప్ కమెడియన్ గా, సోషల్ మీడియా సెలబ్రిటీ గా మంచి పేరు తెచ్చుకున్న మౌళి ఈ చిత్రం ద్వారా మొదటిసారి వెండితెర కి పరిచయం అయ్యాడు. ‘మౌళి టాక్స్'(Mouli Talks) అనే యూట్యూబ్ ఛానల్ ని అనుసరించే ప్రతీ ఒక్కరికి ఈయన సుపరిచితుడే. అలాంటి మౌళి సినిమాల్లోకి రావాలని అనుకోవడం, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడం ఎవ్వరూ ఊహించి ఉండరు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts Movie) చిత్రానికి వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
ఆన్లైన్ ట్రాకింగ్ ప్రకారం ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 2 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ చోట ఈ సినిమాకు అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. తెలంగాణ, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఇలాంటి సినిమాలకు మంచి గ్రాస్ వసూళ్లు రావడం సహజమే. ఎందుకంటే A సెంటర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కాబట్టి. కానీ ఈ చిత్రానికి క్రింది సెంటర్స్ నుండి కూడా భారీ గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇదే అందరినీ షాక్ కి గురి చేసింది. నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి మొదటి రోజున 75 వేల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. చాలా లిమిటెడ్ రిలీజ్ అయినప్పటికీ కూడా మంచి గ్రాస్ వసూళ్లు వచ్చాయని, రెండవ రోజు నుండి థియేటర్స్ ని పెంచారని అంటున్నారు.
ఈ వీకెండ్ మొత్తం కలిపి ఈ సినిమాకు కేవలం నార్త్ అమెరికా నుండే 3 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఒక చిన్న సినిమాకు, కనీసం ప్రేక్షకులకు పేర్లు కూడా తెలియని నటీనటులతో ఈ రేంజ్ గ్రాస్ రావడమంటే మన తెలుగు ఆడియన్స్ సరైన కంటెంట్ సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతుంది. ఓవరాల్ గా మొదటి రోజే దాదాపుగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ చిత్రం వీకెండ్ కి పది కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయట. అదే కనుక జరిగితే కచ్చితంగా ఈ చిత్రానికి నిర్మాతలు పెట్టిన ప్రతీ పైసాకు పదింతలు లాభం వచ్చినట్టే అన్నమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్తుంది అనేది