Little Hearts Collection: నిన్న తెలుగు నుండి రెండు, తమిళం నుండి ఒక్క పెద్ద సినిమా విడుదలైంది. ఈ మూడు సినిమాల్లో ఘాటీ, మదరాసి పెద్ద సినిమాలు, లిటిల్ హార్ట్స్ అనేది చిన్న సినిమా. కచ్చితంగా పెద్ద సినిమాల్లో ఎదో ఒకటి పెద్ద హిట్ అవుతుంది, మూవీ లవర్స్ ఆకలి ని తీరుస్తుంది అనుకున్నారు. కానీ చివరికి చిన్న సినిమా అయినటువంటి లిటిల్ హార్ట్స్(Little Hearts) చిత్రం మూవీ లవర్స్ ఆకలిని తీరుస్తుంది. ‘మౌళి టాక్స్'(Mouli Talks) ఫేమ్ మౌళి హీరో గా, శివాని నాగారం హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎలాంటి సందడి లేకుండా చాలా సైలెంట్ గా విడుదలైంది. కానీ సినిమా లో కంటెంట్ చాలా ఫన్నీ గా ఉండడం తో ఆడియన్స్ థియేటర్స్ కి క్యూలు కట్టడం మొదలు పెట్టారు. మొదటి రోజే ఈ చిత్రానికి 2 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇంతేనా అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని మౌళి లాంటి వాళ్లకు ఇది చాలా పెద్దదే. సినిమాని నిర్మించేందుకు కనీసం రెండు కోట్ల రూపాయిల ఖర్చు కూడా అయ్యుండదు. అందుకే మొదటి రోజే బ్రేక్ ఈవెన్ మార్కు కి చాలా దగ్గరగా వచ్చింది. థియేటర్స్ చాలా తక్కువగా దొరికినప్పటికీ ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది చిన్న విషయం కాదు. ఇక రెండవ రోజు అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విలయతాండవం చేస్తుంది అనే అనుకోవాలి. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 6 నుండి 7 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. అంటే మొదటి రోజు కంటే మూడింతలు ఎక్కువ టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి అన్నమాట. కంటెంట్ కి ఉన్న పవర్ ఎలాంటిదో మరోసారి రుజువు చేసి చూపించారు ప్రేక్షకులు. చూస్తుంటే రెండవ రోజు గ్రాస్ 5 కోట్ల రూపాయిలకంటే ఎక్కువే ఉండేట్టు అనిపిస్తుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రానికి రెండవ రోజు సేల్ అవుతున్న టికెట్స్ కౌంట్, ఈ ఏడాది లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఎన్టీఆర్ ‘వార్ 2’, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రాలకు కూడా సేల్ అవ్వలేదట. దీనిని బట్టి ఈ చిత్రం ఏకంగా పాన్ ఇండియన్ సినిమాల రికార్డ్స్ నే బద్దలు కొట్టింది అనుకోవచ్చు. ఊరు పేరు తెలియని హీరో పవన్ కళ్యాణ్,ఎన్టీఆర్ సినిమాలను కొట్టేంత రేంజ్ కి వచ్చేశాడంటే ఆడియన్స్ తో ఎంత జాగ్రత్తగా ఉండాలో పెద్ద సినిమాల మేకర్స్ కి ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు గమనించాల్సిన సమయం రానే వచ్చింది. మరి ఇక నుండి అయినా డైరెక్టర్లు కంటెంట్ మీద ద్రుష్టి పెట్టి క్వాలిటీ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తారో లేదో చూడాలి.