Jayammu Nischayammura: గత కొంతకాలం క్రితమే జగపతి బాబు వ్యాఖ్యాతగా జీ తెలుగు లో ‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammura) అనే ప్రోగ్రాం మొదలైన సంగతి తెలిసిందే. మొదటి మూడు ఎపిసోడ్స్ కి అక్కినేని నాగార్జున, శ్రీలీల మరియు నేచురల్ స్టార్ నాని రాగా, నాల్గవ ఎపిసోడ్ కి రామ్ గోపాల్ వర్మ, సందీప్ వంగ కలిసి వచ్చారు. వీళ్ళిద్దరిని విడివిడిగా చూస్తేనే ఎదుటి వాళ్ళు తట్టుకోలేరు, ఇక కలిసి ఒక ఇంటర్వ్యూ కి వస్తే ఏమైనా ఉందా?. పైగా హోస్ట్ జగపతి బాబు కూడా కాస్త రా & రిస్టిక్ గా మాట్లాడే వ్యక్తి. ఈ ముగ్గురు కలిసి ఒక ఇంటర్వ్యూ అంటే అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. ఇప్పటి వరకు ప్రసారమైన అన్ని ఎపిసోడ్స్ లో ఈ ఎపిసోడ్ ప్రోమో కి వచ్చినంత క్రేజ్ ఏ ఎపిసోడ్ కి కూడా రాలేదు. కాసేపటి క్రితమే ఈ ఎపిసోడ్ ని జీ5 లో అప్లోడ్ చేశారు.
మరి ఈ ఎపిసోడ్ మన అంచనాలను అందుకుండా లేదా అనేది చూద్దాం. రామ్ గోపాల్ వర్మ మాటలు, ఆయన ఇచ్చే సమాదానాలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయ్యినంత పని అవుతుంది. పాపం ఈయన్ని ఇంటర్వ్యూ చేస్తున్న జగపతి బాబు పరిస్థితి అదే అయ్యింది. ఎపిసోడ్ ప్రారంభం లో జగపతి బాబు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) ని ఒక ప్రశ్న అడుగుతూ ‘నువ్వే ఒక వైరస్ లాంటి వాడివి. అలాంటి నిన్ను వైరల్ ఫీవర్ అటాక్ చేసింది ఒకప్పుడు. డాక్టర్ దగ్గరకు వెళ్తే వారానికి సరిపడా టాబ్లెట్స్ ఇచ్చారట, పూటకి ఒకటి వేసుకోమని ఇస్తే నువ్వు వారానికి సరిపడా టాబ్లెట్స్ ని ఒకేసారి మింగేశావు అట. అసలు ఇదెలా సాధ్యం?, అలా మింగిన తర్వాత కూడా నీకు ఏమి అవ్వలేదంటే, అసలు నీది మాలాంటి మామూలు శరీరమేనా?’ అని అడిగాడు జగపతి బాబు.
దానికి రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇస్తూ ‘డాక్టర్లు నాకు సమయానికి టాబ్లెట్స్ వేసుకోమని చెప్పారు, పూటకి ఒకటి వేసుకోమన్నారు. కానీ వారానికి సరిపడా టాబ్లెట్స్ ని ఒకేసారి వేసుకోవద్దు అని వాళ్ళు కూడా చెప్పలేదు. ఒకసారి వేసుకొని చూస్తే ఏమి అవ్వుధి అని ప్రయత్నం చేశాను. నాకేమి కాలేదు. ఇదే విషయాన్ని నేను కొంతమంది డాక్టర్లకు కూడా చెప్పాను, కానీ వాళ్ళు కూడా పెద్ద సర్ప్రైజ్ కి గురి కాలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. రామ్ గోపాల్ వర్మ ప్రయత్నం చేసాడు కదా అని మీరు కూడా అలాంటి ప్రయోగం చేస్తారేమో, పొరపాటున కూడా చేయకండి. రామ్ గోపాల్ వర్మ కి అదృష్టం ఉంది కాబట్టి ఆయన బ్రతికిపోయాడు. అందరికీ అది వర్కౌట్ అవ్వదు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ, సందీప్ వంగ కలిసి చేసిన ఈ ఇంటర్వ్యూ మన అంచనాలకు తగ్గట్టుగా నే ఉంది. జీ5 లో ఈ ఎపిసోడ్ అందుబాటులో ఉంది.
