Rajinikanth Workout Video: ఇప్పుడు మనం చూస్తున్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరికీ ఊరికే స్టార్ స్టేటస్ రాలేదు. కెరీర్ ప్రారంభం నుండి ఎన్నో కష్టాలు,అవమానాలు ఎదురుకోవాల్సి వచ్చింది. కానీ పైకి రావాలి, జీవితం లో విజయం సాధించాలి, కోట్లాది మంది జనాలకు ఆదర్శంగా నిలవాలి అనే కసి వాళ్ళని నేడు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అలాంటి సూపర్ స్టార్స్ మనం ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) గురించి మాట్లాడుకోవాలి. ఒక సాధారణ బస్సు కండక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత దేశం లో ఏ సూపర్ స్టార్ కూడా చూడనంత స్టార్ స్టేటస్ ని చూసి, 74 ఏళ్ళ వయస్సు లో కూడా అదే సూపర్ స్టార్ స్టేటస్ తో కొనసాగుతూ, వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతూ, నేటి తరం సూపర్ స్టార్స్ కూడా తన స్టామినా ముందు చిన్నవాళ్ళే అని నిరూపించుకున్నాడు ఆయన.
రజినీకాంత్ వయస్సు లో ఉన్న ఇతర నటీనటులు సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసి సంతోషంగా తమ వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు. మరికొంత మంది సూపర్ స్టార్స్ అయితే హీరో క్యారెక్టర్స్ కి టాటా చెప్పి క్యారక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యారు. కానీ రజినీకాంత్ మాత్రం 74 ఏళ్ళ వయస్సులో కుర్ర హీరోలతో సమానంగా ఫైట్స్ చేస్తున్నాడు, వాళ్ళకంటే పవర్ ఫుల్ గా డైలాగ్స్ చెప్పగలుగుతున్నాడు, డ్యాన్స్ కూడా చేస్తున్నాడు. వీటి అన్నిటికి మించి ఆయనలోని స్టైల్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఏ మాత్రం తగ్గలేదు. ఇదంతా ఆయనకు ఊరికే రాలేదు. ఈ వయస్సు లో కూడా ఆయన ప్రతీ రోజు వర్కౌట్స్ చేస్తున్నాడు. వర్కౌట్ చేయనిదే ఆయన రోజు మొదలు అవ్వదట. ఇప్పటి వరకు మీరెవ్వరు ఆయన వర్కౌట్స్ చేయడం చూసి ఉండరు. కానీ ‘కూలీ’ మూవీ షూటింగ్ సమయం లో ఆయన వర్కౌట్ చేస్తున్న ఒక వీడియో ని ఎవరో దొంగచాటుగా షూట్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేశారు.
వామ్మో, మనం ఇంత చిన్న వయస్సులో సమయం చూసుకొని కాసేపు వాకింగ్ చెయ్యమంటేనే బద్ధకం చూపిస్తాము, ఈయనేంటి 74 ఏళ్ళ వయస్సు లో ఈ రేంజ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడు, ఊరికే అయిపోతారా సూపర్ స్టార్లు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే రజినీకాంత్ నెత్తి మీద జుట్టు పోయి ఉండొచ్చు, కానీ విగ్ పెడితే పాతికేళ్ల క్రితం రజినీకాంత్ ఎలా ఉండేవాడో, అలాంటి రజినీకాంత్ నే మనకి కనిపిస్తాడు. ఇదంతా కేవలం ఆయన వర్కౌట్స్ చేయడం వల్లే సాధ్యమైంది. ఇకపోతే రీసెంట్ గానే ‘కూలీ’ చిత్రం తో మన ముందుకొచ్చిన సూపర్ స్టార్, ప్రస్తుతం ‘జైలర్ 2’ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.