Adipurush Trailer Records: అక్షరాలా 74 మిలియన్ వ్యూస్.. చరిత్ర సృష్టించిన ‘ఆదిపురుష్’ ట్రైలర్

తెలుగు లో ఈ సినిమా ట్రైలర్ కి 10.60 మిలియన్ వ్యూస్ మరియు 5 లక్షల 50 వేల లైక్స్ వచ్చాయి. ఇది ఒక ట్రైలర్ కి చాలా తక్కువ వ్యూస్ అనే చెప్పాలి, ప్రభాస్ రేంజ్ కి సరిపడా వ్యూస్ మరియు లైక్స్ తెలుగు లో రాలేదు.

Written By: Vicky, Updated On : May 10, 2023 3:12 pm

Adipurush Trailer Records

Follow us on

Adipurush Trailer Records: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆది పురుష్’ మూవీ ట్రైలర్ నిన్న అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. యూట్యూబ్ తో పాటుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా పలు సెలెక్టివ్ థియేటర్స్ లో కూడా ఈ సినిమా ట్రైలర్ ని ప్రదర్శించారు. రెస్పాన్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా వచ్చింది.

ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ పూనకాలు వచ్చి ఊగిపోయారు.వాళ్లకి శ్రీరాముడు అంటే ఎంత భక్తి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆయనకోసం ప్రాణాలను సైతం ఇచ్చేయడానికి సిద్ధం అవుతారు,అలాంటి మహనీయుడి చరిత్రని ప్రభాస్ లాంటి స్టార్ తో చేస్తూ,సరికొత్త టెక్నాలజీ తో తెరకెక్కించేలోపు ఈ ట్రైలర్ కి కనీవినీ ఎరుగని రేంజ్ రెస్పాన్స్ ని ఇచ్చారు.అన్నీ భాషలకు కలిపి ఈ ట్రైలర్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయో ఒకసారి చూద్దాము.

తెలుగు లో ఈ సినిమా ట్రైలర్ కి 10.60 మిలియన్ వ్యూస్ మరియు 5 లక్షల 50 వేల లైక్స్ వచ్చాయి. ఇది ఒక ట్రైలర్ కి చాలా తక్కువ వ్యూస్ అనే చెప్పాలి, ప్రభాస్ రేంజ్ కి సరిపడా వ్యూస్ మరియు లైక్స్ తెలుగు లో రాలేదు. కానీ హిందీ లో మాత్రం ఏకంగా 24 గంటల్లో 52 మిలియన్ వ్యూస్ మరియు 11 లక్షల లైక్స్ వచ్చాయి, బాలీవుడ్ లో ఖాన్స్ కి కూడా ఈ స్థాయి వ్యూస్ మరియు లైక్స్ ఈ మధ్య కాలం లో రాలేదు.

ఇక ఆ తర్వాత తమిళం మరియు మలయాళం లో చెరో మూడు మిలియన్ కి పైగా వ్యూస్,అలాగే కన్నడం లో 1.76 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక తెలుగుకి సంబంధించి రెండవ ఛానల్ లో మరో 3.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మొత్తం మీద అన్నీ భాషలకు కలిపి 24 గంటల్లో 74 మిలియన్ వ్యూస్ మరియు 20 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.