Mechanic Rocky First Review: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకొని, తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ‘ఈ నగరానికి ఏమైంది’ అనే కల్ట్ క్లాసిక్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన, ఆ తర్వాత ‘ఫలక్ నూమా దాస్’ చిత్రంతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని టాలీవుడ్ లో తన మార్కెట్ ని పదిలపర్చుకున్నాడు. ఆ తర్వాత ఈయన చేసిన చిత్రాలలో ‘హిట్’, ‘ఆకాశవనం లో అర్జున కళ్యాణం’, ‘ధంకీ’ వంటి చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. రీసెంట్ గా ఆయన నుండి విడుదలైన ‘గామీ’ చిత్రానికి కూడా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రం ద్వారా మన ముందుకు ఈ నెల 22 వ తారీఖున రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలైంది.
సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యినట్టు విశ్వక్ సేన్ కాసేపటి క్రితమే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసాడు. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకి UA సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళ నుండి అందుతున్న రిపోర్ట్ ఏమిటంటే, ఈ చిత్రం విశ్వక్ సేన్ కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలబడబోతుందట. హీరోయిన్స్ గా నటించిన మీనాక్షి చౌదరి, శ్రద్ద శ్రీనాథ్ వంటి వారు కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారట. ఫన్, రొమాన్స్,కామెడీ తో పాటు, ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ గా నిలబడబోతుందని టాక్. సరైన హిట్ కొట్టి మరో లెవెల్ కి వెళ్లాలని చూస్తున్న విశ్వక్ సేన్ కి ఈ సినిమా బాగా ఉపయోగపడుతుందని అంటున్నారట. వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న టాలీవుడ్ కి ఇటీవల విడుదలైన ‘కంగువా’, ‘మట్కా’ చిత్రాలు భారీ నష్టాలను మిగిలించింది.
మరి ఆ సినిమాలు చేసిన నష్టాలను ఈ చిత్రం పూడుస్తుందా లేదా?, లేకపోతే మరో భారీ డిజాస్టర్ గా నిలబడబోతుందా అనేది చూడాలి. ఎందుకంటే వచ్చే నెలలో ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 : ది రూల్’ విడుదల కాబోతుంది. కాబట్టి ఆడియన్స్ ఆ చిత్రాన్ని చూడడం కోసం మధ్యలో వచ్చే ఇలాంటి చిన్న సినిమాలకు డబ్బు ఖర్చు చేయడం చాలా కష్టమే. ఒకవేళ ఆడియన్స్ ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తే విశ్వక్ సేన్ అదృష్టం అనే చెప్పాలి. చూడాలి మరి 22 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఎంత మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.