RRR Sensational Record In Hyderabad: రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మిగిలించిన రికార్డ్స్ ఏమి లేవు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఒక్క బాహుబలి 2 సినిమా రికార్డ్స్ మినహా..అన్ని బాషలలో సంచలన విజయం సాధించి 1100 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ సినిమా..ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బాహుబలి పార్ట్ 2 రికార్డ్స్ ని సైతం బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ముఖ్యంగా నైజం ప్రాంతం లో ఈ సినిమా ఇప్పటికి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తూ దాదాపుగా 115 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇక బాగ్యా నగరం హైదరాబాద్ లో అయితే ఈ సినిమా లేటెస్ట్ గా క్రియేట్ చేసిన సరికొత్త రికార్డు ని ఇప్పట్లో ఎవ్వరు కూడా ముట్టుకోలేరు అని చెప్పాలి.

సాధారణంగా హైదరాబాద్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి ఒక్క 10 సెంటర్స్ లో ఒక్క కోటి రూపాయిల గ్రాస్ ని కొల్లగొడితే అది ఒక్క అద్భుతం లాగ చూస్తారు..కానీ #RRR చిత్రం ఏకంగా 46 సెంటర్స్ లో ఒక్క కోటి రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది..జంట నగరాలలో ఉన్న 100 కు పైగా సెంటర్స్ లో 46 సెంటర్స్ లో కోటి రూపాయలకు పైగా గ్రాస్ ని కొల్లగొట్టడం అంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి..ఈ సినిమా తర్వాత KGF చాప్టర్ 2 వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ పోటీకి వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా వసూళ్ల పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు అనే చెప్పాలి..ఇప్పటికి వీకెండ్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో ఇంకా ఎక్కువ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ,అలాగే 50 రోజుల సెంటర్స్ కూడా నైజం ప్రాంతం లో చాలా గట్టిగ వస్తాయి అని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇది ఇలా ఉండగా 5 వ వారం ప్రారంభం లో కూడా #RRR కి పడుతున్న ఫుల్స్ ముందు KGF చాప్టర్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కూడా తేలిపోయింది అంటే ఫామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఏ స్థాయి లో ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు..OTT రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో ఒక్క సినిమాకి ఈ స్థాయి లాంగ్ రన్ రావడం అంటే మాములు విషయం కాదు..ఇటీవల విడుదల అయినా సూపర్ హిట్ సినిమాలు పుష్ప, భీమ్లా నాయక్ కి కూడా ఈ స్థాయి లాంగ్ రన్ రాలేదు అనే చెప్పాలి..సాధారణంగా రెండు మూడు వారాల్లోనే OTT కి కొత్త సినిమాలు వచ్చే విషయం మన అందరికి తెలిసిందే..కానీ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమ్మే ముందే విడుదల అయ్యి రెండు నెలలు దాటినా తర్వాతనే OTT లో స్ట్రీమింగ్ చెయ్యాలని రాజమౌళి షరతులు పెట్టాడు అట..అందుకే మే 25 వ తారీఖున ఈ సినిమా OTT లో అందుబాటులోకి రానుంది..అప్పటిలో వరుకు ఎన్ని సినిమాలు పోటీకి వచ్చిన థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ ఈ సినిమాకి వస్తాయి అని ట్రేడ్ వర్గాల అంచనా.