Pawan Kalyan Ram Charan Multi Starrer: టాలీవుడ్ లో లేటెస్ట్ గా మల్టీస్టార్ర్ర్ సినిమాల జోరు ఒక్క రేంజ్ లో ఉంది..ఇంతకుముందు ఒక్క మల్టీస్టార్ర్ర్ సినిమా చెయ్యాలంటే దర్శక నిర్మాతలు చాలా భయపడేవారు..హీరోలు మల్టీస్టారర్స్ చెయ్యడానికి సిద్దంగానే ఉన్నప్పటికీ ఫాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం ఉండేది..కానీ ఆ భయాలు అన్నిటికి చెక్ పెడుతూ ఈ తరం లో బిగ్గెస్ట్ మాస్ హీరోలు అయినా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లను పెట్టి రాజమౌళి తీసిన #RRR చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడమే కాకుండా..ఇరువురి హీరోల అభిమానులను కూడా తమ అభిమాన హీరో ని ఎక్కడా తక్కువ చేసి చూపించలేదు అనే భావనని అభిమానుల్లో కల్పించాడు రాజమౌళి..ఇద్దరు స్టార్ హీరోలను రాజమౌళి డీల్ చేసిన విధానం ని ఆదర్శంగా తీసుకొని..ఇప్పుడు మన టాలీవుడ్ లో దర్సక నిర్మాతలు నేటి తరం స్టార్ హీరోలతో మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు.

ఇక ఈ నెల 29 వ తారీఖున చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..#RRR సినిమా తర్వాత కేవలం నెల రోజుల గ్యాప్ తో విడుదల అవుతున్న మరో మల్టీస్టార్ర్ర్ సినిమా ఇది..దీని పై మెగా అభిమానుల్లో ఒక్క రేంజ్ అంచనాలు ఉన్నాయి..ట్రైలర్ లో కేవలం చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి ఉన్న షాట్స్ ని చూసే అభిమానులు మెంటలెక్కిపోతున్నారు..ఇక సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి అని టాక్..విడుదల కి సరిగ్గా మూడు రోజుల సమయమే మిగిలి ఉండడం తో ఈ మూవీ ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు రామ్ చరణ్..ఈ ప్రొమోషన్స్ లో భాగంగా ఇటీవలే ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారాయి.
తారక్ తో చేసారు..మీ నాన్నగారితో కూడా ఒక్క సినిమా చేసేసారు..ఇక మీకు ఎంతగానో ఇష్టమైన మీ బాబాయి పవన్ కళ్యాణ్ గారితో మల్టీస్టార్ర్ర్ సినిమా ఎప్పుడు చేస్తారు అని ఒక్క యాంకర్ రామ్ చరణ్ ని అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్తూ ‘ కళ్యాణ్ బాబాయ్ తో సినిమా చెయ్యడానికి నేను ఎప్పుడు సిద్దమే..ఇప్పటికే మేము ఇద్దరం రెండు మూడు స్టోరీ లైన్స్ ని అనుకున్నాం కూడా..త్వరలోనే మా ఇద్దరి మల్టీస్టార్ర్ర్ సినిమా ఉంటుంది..ఆ సినిమాని స్వయంగా నా బ్యానర్ లోనే నిర్మిస్తాను..ప్రస్తుతానికి అయితే నా ద్రుష్టి మొత్తం నా చేతిలో ఉన్న సినిమాల మీదనే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ చరణ్..ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ గారితో ఒక్క సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..సుమారు 60 రోజుల షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం లో రామ్ చరణ్ IAS గా కనిపించబోతున్నాడు..ఈ సినిమా తర్వాత ఆయన జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తినూరి మరియు సుకుమార్ లతో సినిమాలు చేయనున్నాడు..ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి అయినా తర్వాత పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.