Telugu film budgets: ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద హీరోల సినిమాలకే బడ్జెట్ కి తగ్గ బిజినెస్ లు జరగడం లేదు. అలాంటిది చిన్న హీరోల సినిమాలకు నిర్మాతలు వందల కోట్ల రూపాయిలు కుమ్మరించడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్స్ సినిమాలే సరైన బజ్ క్రియేట్ చేసే ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేయకపోతే బిజినెస్ జరగని పరిస్థితి ఉంటే, ఏ నమ్మకంతో నిర్మాతలు మీడియం రేంజ్ మార్కెట్ ఉన్న హీరోల సినిమాలకు ఇంత బడ్జెట్స్ పెడుతున్నారో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న హీరో నిఖిల్ నటించిన ‘స్వయంభు’ మూవీ టీజర్ ని మీరంతా చూసే ఉంటారు. ఈ టీజర్ లో విజువల్స్ ని చూసి భారీ గానే ఖర్చు చేసారని మీకు అనిపించింది కదా?.
ఎంత ఖర్చు చేశారంటే అక్షరాలా 75 కోట్ల రూపాయిలు అన్నమాట. ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీశారు, కానీ టీజర్ కి కనీస స్థాయిలో కూడా రెస్పాన్స్ రాలేదు. టీజర్ లోని ఒక్క షాట్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కానీ కనీస స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే చిన్న సినిమాలకు బడ్జెట్ ఖర్చు చేస్తే సరిపోదు, కచ్చితంగా ప్రమోషనల్ కంటెంట్ వేరే లెవెల్ లో ఉండాలి, అలా లేకపోతే ఎంత బడ్జెట్ ఖర్చు చేసినా బూడిలలో పోసిన పన్నీరే అవుతుంది. ఇకపోతే అక్కినేని నాగచైతన్య హీరో గా నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘వృష కర్మ’ కి కూడా బడ్జెట్ హద్దులు దాటేసింది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తుంటే ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయిల బడ్జెట్ ఖర్చు అయ్యిందట.
నాగచైతన్య కి చూస్తే అంత పెద్ద మార్కెట్ లేదు. కచ్చితంగా ఈ చిత్రం కూడా మంచి ప్రమోషనల్ కంటెంట్ మీదనే ఆధారపడుంది. ఈ రెండు సినిమాల సంగతి పక్కన పెడితే, కొత్త హీరో నటించిన ‘నాగ బంధం’ చిత్రానికి కూడా వంద కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశారట. పైన చెప్పిన ఇద్దరూ మీడియం రేంజ్ హీరోలు, పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా బడ్జెట్ కి తగ్గ కలెక్షన్స్ ని రాబడుతారు. కానీ ఏ ధైర్యం తో నిర్మాతలు కొత్త హీరో మీద 100 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేశారు?, అవి డబ్బులు అందుకుంటున్నారా?, లేకపోతే మంచి నీళ్లు అనుకుంటున్నారా?, ఏమైంది నిర్మాతలకు, ఇలా ఖర్చు చేస్తున్నారేంటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.