Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది'(#PeddiFirstShot) టీజర్ నిన్న విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కేవలం రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాకుండా, ఇతర హీరోల అభిమానులు కూడా ఈ టీజర్ ని అమితంగా ఇష్టపడ్డారు. ముఖ్యంగా టీజర్ చివర్లో వచ్చిన షాట్ మామూలు రేంజ్ లో వైరల్ అవ్వలేదు. ఇప్పటి వరకు క్రికెటర్స్ నుండి ఎన్నో అద్భుతమైన షాట్స్ ని చూసాము కానీ, ఇలాంటి షాట్ ని మాత్రం ఇప్పటి వరకు చూడలేదు. కోహ్లీ, రోహిత్, ధోని లాంటి క్రికెటర్స్ ఈ షాట్ ని చూస్తే కచ్చితంగా వాళ్ళు తమ తదుపరి మ్యాచ్ లో ఇలా ఒక్క షాట్ అయినా ఆడే ప్రయత్నం చేస్తారని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ఈ టీజర్ యూట్యూబ్ లో ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది.
Also Read: 2 కోట్లతో మొదలై ఏకంగా 60 కోట్లు..సైలెంట్ హిట్ గా నిల్చిన విక్రమ్ ‘వీర ధీర శూర2’
24 గంటలు కూడా పూర్తిగా గడవకముందే ఈ టీజర్ కి అప్పుడే మూడు కోట్లకు పైగా వ్యూస్, నాలుగు లక్షల లైక్స్ వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా డీసెంట్ స్థాయి రెస్పాన్స్ ని దక్కించుకుంది. కానీ లాంగ్ రన్ లో మాత్రం బ్లాక్ బస్టర్ స్టేటస్ కి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. హిందీ వెర్షన్ టీజర్ నిన్ననే విడుదల అవ్వాల్సింది, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల నేటికి వాయిదా వేశారు. నేడు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ టీజర్ హిందీ వెర్షన్ లో విడుదల కానుంది. T సిరీస్ యూట్యూబ్ ఛానల్ లో ఈ టీజర్ ని చూడొచ్చు. రామ్ చరణ్ కి మొదటి నుండి నార్త్ ఇండియా లో మంచి క్రేజ్ ఉంది.
‘రంగస్థలం’ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి విడుదల చేసుంటే అక్కడ కూడా కలెక్షన్ల సునామీని సృష్టించి ఉండేదని, బంగారం లాంటి అవకాశాన్ని రామ్ చరణ్ మిస్ చేసుకున్నాడని అందరూ అంటుంటారు. కానీ ‘పెద్ది’ చిత్రం ఆ లోటుని హిందీలో పూడుస్తుందని అనుకోవచ్చు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకు అభిమానుల్లో మంచి పాజిటివ్ బజ్ ని ఏర్పాటు చేసుకుంది. ట్రేడ్ కూడా ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పుడే భారీ గా బిజినెస్ ఆఫర్స్ ని క్వాట్ చేస్తున్నారు. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే ఈ చిత్రం ఆల్ టైం రికార్డ్స్ నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. నిన్న విడుదలైన టీజర్ తర్వాత ప్రాంతాల వారీగా థియేట్రికల్ రైట్స్ కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లో అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ పెద్ది ఇంకెన్ని రికార్డ్స్ ని నెలకొల్పుతుంది అనేది.