PKSDT Bro Motion Poster: సోషల్ మీడియా గత 24 గంటలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతిలో ఉండిపోయింది.ట్విట్టర్ , ఫేస్ బుక్ , ఇంస్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ మ్యానియా నే కనిపిస్తుంది. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో’ మోషన్ పోస్టర్ ని అధికారికంగా మూవీ టీం విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్ లో సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
పవన్ కళ్యాణ్ లుక్స్ కూడా స్టైలిష్ గా ఉన్నాయి. పంజా చిత్రం తర్వాత ఆయన మళ్ళీ ఆ రేంజ్ స్టైల్ గా కనిపించింది ఈ చిత్రం లోనే.ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ లుక్స్ పట్ల ఎంతో సంతోషం గా ఉన్నారు. ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.
ఇది ఇలా ఉండగా ఈ మోషన్ పోస్టర్ కి ఇప్పటి వరకు దాదాపుగా 11 మిలియన్ వ్యూస్ సోషల్ మీడియా లో వచ్చాయట.ఇది కేవలం సౌత్ లో మాత్రమే కాదు, ఇండియా లోనే ఆల్ టైం రికార్డు అట.యూట్యూబ్ లో 6 మిలియన్ వ్యూస్ రాగా , ఇంస్టాగ్రామ్ లో 5 మిలియన్ వ్యూస్ వచ్చాయట.తమిళం లో అజిత్ హీరో గా నటించిన ‘వలిమై’ చిత్రం మోషన్ పోస్టర్ కి 24 గంటల్లో 5.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
నిన్న మొన్నటి వరకు సౌత్ లో అదే రికార్డు, ఇప్పుడు ఆ రికార్డు ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా తేలికగా దాటేసారు. కానీ లైక్స్ విషయం లో మాత్రం దగ్గర్లోకి కూడా రాలేకపోయారు. వలిమై చిత్రానికి 9 లక్షలకు పైగా లైక్స్ రాగా, ‘బ్రో’ చిత్రానికి మాత్రం కేవలం లక్ష 20 వేల లైక్స్ మాత్రమే వచ్చాయి.ఈ ఒక్క రికార్డు మిస్ అయ్యిందని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొద్దిగా నిరాశకి గురయ్యారు.