Adipurush Trailer Records: అక్షరాలా 108 మిలియన్ వ్యూస్.. చరిత్ర తిరగరాసిన ‘ఆదిపురుష్’ ట్రైలర్

ప్రతీ భాషలోనూ అద్భుతమైన వ్యూస్ ని సంపాదించుకుంది ఈ ట్రైలర్. ఇప్పటి వరకు ట్రైలర్ ని విడుదల చేసి నాలుగు రోజులు అవ్వగా, ఈ నాలుగు రోజులకు గాను అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి 108 మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలుస్తుంది. ఏ భాషలో ఎన్ని వ్యూస్ వచ్చాయో ఒక్కసారి ఈ స్టోరీ లో చూద్దాం.

Written By: Vicky, Updated On : May 13, 2023 4:18 pm

Adipurush Trailer Records

Follow us on

Adipurush Trailer Records: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆది పురుష్’ చిత్రం వచ్చే నెల 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. హిందీ లో తెరకెక్కించిన ఈ సినిమాని తెలుగు , తమిళం , మలయాళం మరియు కన్నడ బాషలలో కూడా గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రతీ భాషలోనూ అద్భుతమైన వ్యూస్ ని సంపాదించుకుంది ఈ ట్రైలర్. ఇప్పటి వరకు ట్రైలర్ ని విడుదల చేసి నాలుగు రోజులు అవ్వగా, ఈ నాలుగు రోజులకు గాను అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి 108 మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలుస్తుంది. ఏ భాషలో ఎన్ని వ్యూస్ వచ్చాయో ఒక్కసారి ఈ స్టోరీ లో చూద్దాం.

హిందీ లో ఈ సినిమా ట్రైలర్ కి దాదాపుగా 60 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంత తక్కువ సమయం లో ఈ స్థాయి వ్యూస్ ఒక బాలీవుడ్ ట్రైలర్ కి రావడం ఇదే తొలిసారి. షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ కి కూడా ఈ స్థాయి వ్యూస్ రాలేదు.

ఆ తర్వాత తెలుగు లో ఈ ట్రైలర్ ని రెండు చానెల్స్ లో విడుడుదల చేసారు. ఈ రెండు చానెల్స్ కి కలిపి 32 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ తమిళం లో 10 మిలియన్ వ్యూస్ , మలయాళం లో 3.4 మిలియన్ వ్యూస్, కన్నడ లో 2.6 వ్యూస్ వచ్చాయి. ట్రైలర్ తోనే ఇన్ని అద్భుతమైన రికార్డ్స్ ని నెలకొల్పితే ఇక సినిమా విడుదలైతే వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు ట్రేడ్ పండితులు, చూడాలి మరి.