Salaar Teaser Records: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘సలార్’ మూవీ సెప్టెంబర్ 28 వ తారీఖున గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని నిన్న ఉదయం 5 గంటల 14 నిమిషాలకు విడుదల చేసారు. ఆ సమయం లో విడుదల చేస్తున్నారు. వ్యూస్ మరియు లైక్స్ ఏమి వస్తాయి అని అనుకున్నారు అందరూ.
కానీ ఈ టీజర్ కి కేవలం 24 గంటల్లోనే 83 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఒక్క KGF చాప్టర్ 2 టీజర్ కి తప్ప , ఈ రేంజ్ వ్యూస్ ఏ సినిమాకి కూడా రాలేదు. అన్నీ భాషలకు కలిపి ఒకే టీజర్ గా విడుదల చెయ్యగా, ఇందులోని డైలాగ్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది.
ఇది ఇలా ఉండగా ఈ టీజర్ మరో అద్భుతమైన ఫీట్ ని అందుకోబోతుంది, ఈ టీజర్ అతి తావరలోనే 100 మిలియన్ కి పైగా వ్యూస్ మరియు , రెండు మిలియన్ కి పైగా లైక్స్ ని సొంతం చేసుకోబోతున్నాయి. టీజర్ విడుదలై 48 గంటల్లోపే ఈ రేంజ్ వ్యూస్ ని మరియు లైక్స్ ని దక్కించుకున్న ఏకైక సినిమాగా ‘సలార్’ చిత్రం నిలవబోతుంది.
టీజర్ లో ప్రభాస్ ముఖం చూపించకుండానే ఈ రేంజ్ అద్భుతాలు క్రియేట్ అయ్యాయి అంటే, ఇక ఆయన ముఖం చూపించి ఉంటే ఏ రేంజ్ అద్భుతాలు జరిగేవో అని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ లో ప్రభాస్ తో సరిసమానమైన పాత్ర ఇచ్చినట్టు తెలుస్తుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, అనుపమ్ ఖేర్ , జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.