Highest Paid Actors 2022: ఓ హీరో మార్కెట్ ఆధారంగా ఆయన రెమ్యూనరేషన్ ఉంటుంది. ఆ మార్కెట్ ని డిసైడ్ చేసేది సదరు హీరో స్టార్ డమ్. ఒకప్పుడు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న బాలీవుడ్ హీరోలు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేవారు. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కావడంతో బాలీవుడ్ స్టార్స్ కి అన్ని పరిశ్రమల్లో ఇమేజ్, స్టార్ డమ్ ఉండేది. ఈ కారణంగా సల్మాన్, షారుక్, అమీర్ , హృతిక్, అక్షయ్ వంటి స్టార్స్ ఇతర పరిశ్రమల స్టార్స్ కంటే అధికంగా రెమ్యునరేషన్ తీసుకునేవారు.

గత పదేళ్లలో సినారియో మారిపోయింది. సౌత్ స్టార్స్ ఈ విషయంలో బాలీవుడ్ స్టార్స్ ని వెనక్కి నెట్టి పైకెళ్లిపోయారు. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోలుగా అవతరించారు. పాన్ ఇండియా కాన్సెప్ట్ తో బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో మార్కెట్ పెంచుకొని వందల కోట్లు పారితోషికంగా అందుకుంటున్నారు. మరి దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్-10 హీరోలు ఎవరు? ఎంత తీసుకుంటున్నారు? అనేది చూద్దాం.
Also Read: Prabhas Darling: ప్రభాస్ ‘డార్లింగ్’ సినిమాలో హీరోయిన్ రోల్ ని మిస్ చేసుకున్నది ఎవరో తెలుసా?
విక్రమ్ మూవీతో ఒక్కసారిగా లిస్ట్ లో టాప్ కి చేరాడు కమల్ హాసన్. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్ వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో భారతీయుడు 2 చిత్రానికి కమల్ రెమ్యూనరేషన్ పెంచేశారు. ఆయన అక్షరాలా రూ. 150 కోట్లు తీసుకుంటున్నారట.

ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే చిత్రాల బడ్జెట్ కలిపితే… రూ. 1200-1500 కోట్ల వరకు ఉంటుంది. ఆయనతో సినిమా అంటే కనీసం నాలుగు వందల కోట్లు కావాలి. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ చిత్రాల హీరోగా ఎదిగిన ప్రభాస్ సినిమాకు రూ. 100 నుండి రూ. 150 కోట్లు తీసుకుంటున్నారు.

ఇక మూడవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ ఉన్నారు. ఇప్పటి వరకు మహేష్ ఒక్క పాన్ ఇండియా చిత్రం కూడా చేయలేదు. ఆయన రెమ్యూనరేషన్ రూ. 50-70 కోట్లుగా ఉంది. కానీ వచ్చే ఏడాది ప్రారంభం కానున్న రాజమౌళి మూవీకి ఆయన రూ. 100-150 కోట్లు తీసుకుంటున్నారట.

జయాపజయాలతో సంబంధం లేకుండా బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోలుగా ఉన్నారు సల్మాన్ ఖాన్&షారుఖ్ ఖాన్. వీరిద్దరూ సాలిడ్ బాక్సాఫీస్ హిట్ ఇచ్చి చాలా కాలం అవుతుంది. అయినప్పటికీ వీరికి ఉన్న పాపులారిటీ, మార్కెట్ రీత్యా రూ. 100 కోట్లకు తక్కువ తీసుకోవడం లేదు.

రజినీకాంత్ ఈ లిస్ట్ లో ఒకప్పుడు టాప్ లో ఉండేవారు. కోనేళ్ళుగా రజినీకాంత్ పూర్తి స్థాయిలో సత్తా చాట లేకపోతున్నారు. ఇతర భాషల్లో రజినీ సినిమాలు ఆడడం లేదు. ప్రస్తుతం రజినీకాంత్… సినిమాకు రూ.75-100 కోట్లు తీసుకుంటున్నారు.

పుష్ప హిట్ తో అల్లు అర్జున్ ఇమేజ్ దేశవ్యాప్తమైంది. మనోడికి ఫుల్ పాపులారిటీ దక్కింది. హిందీలో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన పుష్ప అల్లు అర్జున్ ని పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేర్చింది. త్వరలో పుష్ప 2 మొదలుకానుంది. ఈ చిత్రానికి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ దాదాపు రూ.100 కోట్లని సమాచారం.

ఒక్క పాన్ ఇండియా హిట్ లేకున్నా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో విజయ్. ఆయన గత చిత్రం బీస్ట్ ప్లాప్ టాక్ తో కూడా 90% పైగా రికవరీ సాధించింది. ఇక సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా ఉన్న విజయ్ సినిమాకు రూ. 50 నుండి 100 కోట్లు తీసుకుంటున్నారు.

ఆర్ ఆర్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ గతంలో రూ. 50 కోట్లకు లోపే తీసుకునేవారు. ఆర్ ఆర్ ఆర్ ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. వరల్డ్ వైడ్ రూ. 1100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు పాన్ ఇండియా ఇమేజ్ సొంతం కాగా… ప్రస్తుతం సినిమాకు రూ. 50-75 కోట్లు తీసుకుంటున్నారు.

బాలీవుడ్ టాప్ స్టార్స్ గా ఉన్న అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ సినిమాకు రూ. 50 నుండి 75 కోట్లు తీసుకుంటున్నారు.

ఇక మరో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల లిస్ట్ లో చేరారు. ఆయన కూడా సినిమాకు రూ. 50-75 కోట్లు ఆర్జిస్తున్నారు. ఇవి ఇండియన్ హీరోల రెమ్యూనరేషన్ డీటెయిల్స్.
Also Read: Rashmi Gautam: వాడుకొని వదిలేస్తారని ముందే తెలుసు… అన్నిటికీ ఇష్టపడే పరిశ్రమకు వచ్చిన రష్మీ!