https://oktelugu.com/

NTR Dragon: సలార్ లో కాటేరమ్మ ఎపిసోడ్ ఉన్నట్టే ఎన్టీయార్ డ్రాగన్ లో కూడా అలాంటి ఫైట్ ఉండబోతుందా..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళను వాళ్ళు చాలా గొప్పగా చూపించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు...ఇక దానికి తగ్గట్టుగానే సినిమాలు చేస్తూ స్టార్ హీరోలుగా మారుతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 21, 2024 / 09:45 AM IST

    NTR Dragon

    Follow us on

    NTR Dragon: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్…ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తే పాన్ ఇండియాలో ప్రభాస్ ని మించిన స్టార్ హీరో మరొకరు ఉండరు అనేది మాత్రం ప్రూవ్ అవుతుంది. మరి ఇదిలా ఉంటే ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం లో ఉన్నాడు. ఇక ఇంతకుముందు ఆయన చేసిన సలార్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక భారీ ప్రాజెక్టు ను చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతానికైతే డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరక్కెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరుపుకోబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆయన భారీ ఎత్తున సక్సెస్ సాధించాలనే ప్రణాళికలను రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని అందుకుంటే పాన్ ఇండియా డైరెక్టర్లలో తను కూడా ఒకడి గా తన పేరుని సుస్థిరం చేసుకుంటాడు.

    ఇక సలార్ సినిమాలో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దీని కోసమే ఐదు కోట్ల వరకు ఖర్చు కూడా పెట్టిబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే మరోసారి తను డార్క్ మోడ్ లో ఈ సినిమాను చేసి సూపర్ సక్సెస్ గా నిలపడానికి ప్రశాంత్ నీల్ ప్రణాళికలైతే రూపొందిస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ ఎన్టీయార్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తాడు అనేది.

    ఇక కే జి ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన ప్రశాంత్ నీల్… ప్రస్తుతం ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ సాధిస్తే ఇక ఆయనతో పాన్ ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరూ ఒక్క సినిమా చేయడానికి మరింత ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు…