రాజకీయాలపై ‘రౌడీ దేవరకొండ’ సంచలన కామెంట్స్..!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుత రాజకీయాలు.. ఓటుహక్కుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత కాంట్రవర్సీగా ఉండటంతో సోషల్ మీడియాలో వాడివేచి చర్చ నడుస్తోంది. కొందరు విజయ్ దేవరకొండకు మద్దతు తెలుపుతుండగా మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. Also Read: తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో భూకంపం.. ఎందుకొస్తుందంటే? ఇంతకు విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే.. తనకు రాజకీయాలు చేసేంత ఓపికలేదని.. అసలు మన రాజకీయ వ్యవస్థే అర్థంపర్థం లేకుండా పోయిందని వ్యాఖ్యానించాడు. అంతటితో […]

Written By: NARESH, Updated On : October 11, 2020 10:37 am
Follow us on

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుత రాజకీయాలు.. ఓటుహక్కుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత కాంట్రవర్సీగా ఉండటంతో సోషల్ మీడియాలో వాడివేచి చర్చ నడుస్తోంది. కొందరు విజయ్ దేవరకొండకు మద్దతు తెలుపుతుండగా మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో భూకంపం.. ఎందుకొస్తుందంటే?

ఇంతకు విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే.. తనకు రాజకీయాలు చేసేంత ఓపికలేదని.. అసలు మన రాజకీయ వ్యవస్థే అర్థంపర్థం లేకుండా పోయిందని వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగిపోకుండా పేదలకు.. డబ్బున్నవాళ్లకు.. లిక్కర్ తాగేవాళ్లకు ఓటు హక్కు ఉండొద్దన్నాడు. కేవలం మధ్యతరగతికి మాత్రమే ఓటు కల్పించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

విమానం నడిపే పైలట్ ను దానిలో ఎక్కే 300మంది ప్రయాణీకులు ఓట్లు వేసి ఎన్నుకోరని.. అదేవిధంగా సమాజాన్ని నడిపే బాధ్యతను పూర్తి అవగాహన ఉన్న నాయకుడి చేతిలోనే పెట్టాలని హితవు పలికాడు. అందరికీ ఓటుహక్కు కల్పించడం ద్వారా అది దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని కామెంట్స్ చేశాడు. విజయ్ వ్యాఖ్యలను కొందరు సమర్ధిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

Also Read: దుబ్బాక ఎన్నిక వేళ.. రఘునందన్‌రావును వెంటాడుతున్న ఆ మహిళ ఎవరు..?

విజయ్ వ్యాఖ్యలు నియంతృత్వాన్ని సమర్థించేలా ఉన్నాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపేలా కన్పిస్తున్నాయి. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్మాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ మూవీలో నటిస్తున్నాడు.