LIK Movie Review : ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. డిఫరెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ లను సాధిస్తున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలైతే ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని సినిమాలను ఓకే చేసుకుంటున్నారు. అయిన ప్రదీప్ రంగనాథన్ వరుసగా మూడు సక్సెస్ లతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ‘ఎల్ఐకే’ సినిమాతో మరోసారి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
కథ
2040 వ సంవత్సరంలో ప్రేమ ఎలా ఉంటుంది. అప్పుడు ప్రేమికులు ప్రేమలో ఓడిపోతే వాళ్లకు కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఉంటుంది. ఈ కంపెనీ కి సీఈఓ గా ఎస్ జే సూర్య ఉంటాడు. ఇక ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి ప్రేమించుకుంటారు. పీకల్లోతు ప్రేమ లో ఉన్న వీళ్ళు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది. ఆ ఇన్స్యూరెన్స్ కంపెనీ వల్ల వాళ్లకు కలిగిన లాభం ఏంటి? ఫైనల్ గా వీళ్లిద్దరు కలిశారా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ సినిమాలో ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉండబోతుందో కండ్లకు కట్టినట్టుగా చూపించాడు. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ హీరోయిన్ కృతి శెట్టి క్యారెక్టర్లను మలిచిన విధానం కూడా చాలా బాగుంది. మంచి ప్రేమికుడు ఎలా ఉంటున్నాడు అనే దానికి 2040 వ సంవత్సరంలో ప్రేమికులు ఎలా ఉండబోతున్నారనే దాని మీద చాలా బాగా రీసెర్చ్ చేసి మరి ఆయన ఈ సినిమా చేశాడు. ఇక మొదటి సీన్ లోనే ఈ సినిమాకు సంబంధించిన విజన్ అర్థమైపోతుంది…
సినిమాలోని కీలకమైన సన్నివేశాలను చాలా బాగా హ్యాండిల్ చేసిన విఘ్నేష్ శివన్ ఫస్టాఫ్ లో కొంతవరకు తడబడ్డాడు. అయినప్పటికి సెకండాఫ్ లో చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగాడు. ముఖ్యంగా ఆయన సినిమాల్లో ఒక కోర్ ఎమోషన్ అయితే సినిమా మొత్తాన్ని రన్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో కూడా అదే పాటర్న్ ఫాలో అవుతూ ముందుకు దూసుకెళ్లాడు… ఇక దానికి తోడుగా ప్రదీప్ రంగనాథన్ చేసే కామెడీ ఎపిసోడ్స్ బాగున్నాయి. ప్రదీప్ ఎస్ జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు, హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంగేజ్ చేశాయి.
ఇక సెకండాఫ్ లో ఒక కోర్ ఎమోషన్ మీద సాగే సన్నివేశాలు సైతం ప్రేక్షకుడిని రక్తం కట్టించాయి. ఓవరాల్ గా ఈ సినిమాను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడనే చెప్పాలి… క్లైమాక్స్ సన్నివేశం కొంతవరకు డల్ అయింది. రొటీన్ రెగ్యులర్ గానే అనిపించింది. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకున్నప్పుడు దాన్ని కూడా కొంచెం కొత్తగా రాసుకొని ఉంటే సినిమా మీద ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువగా ఉండేది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ప్రదీప్ రంగనాథన్ గత సినిమాల మాదిరిగానే ఈ మూవీలో చాలా ఇంటెన్స్ యాక్టింగ్ చేశాడు. ‘లవ్ టుడే’ సినిమాలో ఎలాగైతే హ్యూమర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడో ఈ మూవీలో అలాంటి సన్నివేశాలను చాలా ఈజ్ తో చేశాడు… కృతి శెట్టి సైతం హీరో పాత్రకి చాలా బాగా సపోర్ట్ చేసింది. ముఖ్యంగా తన పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉండడంతో తను కూడా చాలా బాగా నటించింది… ఎస్ జె సూర్య ఇంతకుముందు చేసిన అన్ని సినిమాలకంటే కూడా ఇందులో వైవిధ్యభరితమైన నటనని చూపించాడు. ముఖ్యంగా ఆయన కొన్ని కామెడీ సీన్స్ లో చాలా బాగా యాక్టింగ్ చేశాడు. దానికి తోడుగా ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ఆయన చాలా బాగా నటించి మెప్పించాడు… ఇక మిగిలిన నటీనటులందరూ వల్ల పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు…
అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన చాలా బాగా కేర్ఫుల్ గా వ్యవహరించాడు. సాంగ్స్ కూడా ఈ సినిమాకి హైలెట్ అయ్యాయి. అనిరుద్ ఈ సినిమాకి తన మ్యూజిక్ తో ప్రాణం పోశాడు… సినిమాటోగ్రఫీ కూడా 2040వ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎలాంటి లొకేషన్స్ ఉంటాయి వాటన్నింటిని కెమెరాలో చాలా బాగా బంధించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి…
ఈ సినిమాలో బాగున్నవి…
ప్రదీప్ రంగనాథన్, ఎస్ జే సూర్య యాక్టింగ్
కథ
ఎమోషనల్ సీన్స్
ఈ మూవీలో బాగోలేనివి
రొటీన్ క్లైమాక్స్
ఫస్టాఫ్ కొంచెం లాగ్ అయింది…
రేటింగ్ : 2.5/5
చివరి లైన్ : వీలైతే ఫ్యామిలీ తో కలిసి ఒకసారి చూడవచ్చు…