https://oktelugu.com/

Vijay Devarakonda Bold Look: లైగ‌ర్ బోల్డ్ లుక్ వైర‌ల్‌.. అక్కడ గులాబీలను పెట్టుకున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda Bold Look: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అందుకే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఓ పోస్ట‌ర్‌ను వ‌దిలింది లైగ‌ర్ టీం. ఈ పోస్ట‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ డ్రెస్ లేకుండా పికే సినిమాలో అమీర్ ఖాన్ స్టైల్ లో దర్శనం ఇచ్చాడు. ఈ పోస్టర్‌లో విజయ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : July 2, 2022 / 01:05 PM IST
    Follow us on

    Vijay Devarakonda Bold Look: డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అందుకే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఓ పోస్ట‌ర్‌ను వ‌దిలింది లైగ‌ర్ టీం. ఈ పోస్ట‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ డ్రెస్ లేకుండా పికే సినిమాలో అమీర్ ఖాన్ స్టైల్ లో దర్శనం ఇచ్చాడు.

    Vijay Devarakonda

    ఈ పోస్టర్‌లో విజయ్ దేవ‌ర‌కొండ న్యూడ్‌గా క‌నిపించడమే.. మెయిన్ హైలైట్ అనుకుంటే, గులాబీలను అడ్డు పెట్టుకుని కనిపించడం మరో హైలైట్. ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో ఎక్క‌డ చూసినా లైగ‌ర్ టీం వ‌దిలిన విజ‌య్ దేవ‌ర‌కొండ పోస్ట‌ర్ మాత్రమే సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది.

    Also Read: Floating Power Plant In The Country: అలలపై ‘సౌర’భాలు.. దేశంలోనే నీటిపై తేలియాడే విద్యుత్ ప్లాంట్ మనదే

    విజయ్ దేవరకొండ తన కెరీర్ లో కీలకమైన రెండేళ్ళ సమయాన్ని పూర్తిగా ‘లైగర్’ సినిమాకే కేటాయించాడు. పూరి కూడా ఒక సినిమా కోసం ఈ స్థాయిలో ఎప్పుడూ సమయాన్ని కేటాయించలేదు. అందుకే విజయ్ దేవరకొండ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కాగా విజయ్ కి సినిమా చాలా బాగా నచ్చిందట. సినిమా అద్భుతంగా వచ్చిందని, కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా సూపర్ హిట్ అవుతుందని విజయ్ ధీమాగా ఉన్నాడు.

    Vijay Devarakonda

    అన్నిటికి మించి దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పైగా బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుకే హిందీలో కూడా లైగర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

    Also Read: Senior Heroine Malavika: ఫేడ్ అవుట్ హీరోయిన్ కి సడెన్ గా క్రేజ్.. కారణం ఆయనే !

    Tags