Floating Power Plant In The Country: దేశంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంటు రామగుండంలోని ఎన్టీపీసీలో ఏర్పాటు చేసింది. వంద మెగావాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంటును నిర్మించింది. రూ.423 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను స్థాపించింది. బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో పనులు నిర్వహించారు. ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ కు భూమి చాలా తక్కువ అవసరం ఉంటుంది. నీటిపై నిర్మించిన ప్లాంటు కావడంతో దీనికి భూసేకరణ ఖర్చు తగ్గుతుంది. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిలో ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించగా ఇప్పుడు నీటిపై తేలియాడే పవర్ ప్లాంట్ ను నిర్మించి సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది.
సౌర విద్యుత్ ఉత్పత్తితో మొత్తం పరికరాలు నీటిపై తేలియాడుతూ ఉండటమే ఇందులో ప్రత్యేకత. హైడెన్సిటీ పాలిథీన్ మెటీరియల్ తో అన్నింటిని బిగించారు. దీంతో దీని కోసం ఒక్కో పరికరం 2.5 మెగావాట్లతో 40 బ్లాకులుగా విభజించి నిర్మించారు. నీటిపై తేలియాడే ప్లాంటు కావడంతో రిజర్వాయర్ అడుగు భాగంలో కాంక్రీటు బ్లాకులకు లంగరు వేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను 33 కేవీ ద్వారా అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా దగ్గరలోని స్విచ్ యార్డుకు సరఫరా అందజేస్తున్నారు.
Also Read: Modi Arrival: మోడీ రాక.. బేగంపేట ఎయిర్ పోర్టుకు మోడీ.. ఆహ్వానించేందుకు మాత్రం కాదు.. ఎందుకంటే?
నీటిపై తేలియాడే ప్లాంటు కావడంతో స్థల సమస్య ఉండదు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. జలాశయంలో నీటిపై బ్లాకులు తేలియాడుతుండటంతో నీటి ఆవిరి కాదు. ఫలితంగా నీటి సామర్థ్యం తగ్గదు. సోలార్ ప్యానెల్స్ కింద నీరు ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. థర్మల్ విద్యుత్ కు బదులుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేపట్టడంతో పర్యావరణ సమస్య తలెత్తకుండా కర్బన ఉద్గారాలు కూడా బయటకు రాకుండా ఉంటాయి. దీంతో మనకు ఎలాంటి నష్టం వాటిల్లదని తెలుస్తోంది.
సోలార్ విద్యుత్ ప్లాంట్ తో విద్యుత్ సామర్థ్యం పెరుగుతోంది. 217 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రామగుండం ఎన్టీపీసీ రికార్డు నెలకొల్పనుంది. కేరళలోని కాయంకులంలో 92 మెగావాట్లు, ఆంధ్రప్రదేశ్ లోని సింహాద్రిలో 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఫ్లోటింగ్ ప్లాంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. రామగుండంలో నెలకొల్పిన సోలార్ ప్లాంటు వంద మెగావాట్లు ఉత్పత్తి చేయడంతో దేశంలోనే ఇదే పెద్దదిగా మారుతోంది. ఈ నేపథ్యంలో రామగుండం మరో రికార్డుకు చేరువయిందని తెలుస్తోంది.
Also Read: Daddy Movie Child Artist: డాడీ సినిమాలో చిన్నారి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?