Liger: దేశవ్యాప్తంగా ఇప్పుడు ‘లైగర్’ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ సినిమాను తొలి షోను చూసి ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ట్విట్టర్ లో ఇప్పటికే లైగర్ మేనియా మారుమ్రోగుతోంది. ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ యాక్టింగ్, సినిమా గురించే చెప్పుకుంటున్నారు.

ఇప్పుడు ఎక్కడ చూసినా ‘లైగర్’ మేనియానే. దేశవ్యాప్తంగా విడుదలైన పూరి-విజయ్ దేవరకొండ కాంబినేషన్ మూవీని చూడాలని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను తొలి షోలోనే చూడాలని ప్రేక్షకులంతా ఎగబడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో తొలి రోజు షోలన్నీ బుక్కైపోయినట్టు తెలిసింది. ఎంతగా అంటే సినీ ప్రముఖులకు కూడా టికెట్లు దొరకనంత రష్ ఉందట.
ఇక దేశవ్యాప్తంగా లైగర్ మూవీ ప్రమోషన్లు నిర్వహించిన లైగర్ టీం.. థియేటర్లలో చూడాలని జనానికి పిలుపునిస్తున్నారు. తాజాగా లైగర్ కు వస్తున్న స్పందన చూసి ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన ‘చార్మి’ ఎమోషనల్ అయ్యింది. ఈరోజు కోసమే ఎదురుచూస్తున్నానని.. నా కళ్ల నిండా కన్నీళ్లు ఆనందభాష్పాలుగా వస్తున్నాయని.. లైగర్ కు వస్తున్న స్పందన చూసి.. మీ సపోర్టు చూసి నా జీవితానికి ఇంతకంటే ఆనందం లేదని చార్మి భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.

లైగర్ సినిమాకు కరీంనగర్ కు అనుకోని ముడి పడింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, ఆయన తల్లి పాత్ర పోషించిన రమ్యక్రిష్ణది కరీంనగర్ కావడం విశేషం. కరీంనగర్ నుంచి విజయ్ ను పట్టుకొని ముంబైకి వెళుతుంది రమ్యక్రిష్ణ. అక్కడ పొట్టతిప్పలు కోసం పనులు చేస్తుంటుంటి. తన కొడుకును బాక్సర్ గా తీర్చిదిద్దాలని అనుకుంటుంది. సో ‘లైగర్’ది మన కరీంనగర్ అని తెలియడంతో ఆ ప్రాంత వాసులంతా ‘మనోడే విజయ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కరీంనగర్ కుర్రాడి పంచ్ వెండితెరపై పేలిపోయిందని కితాబిస్తున్నారు. కరీంనగర్ కుర్రాడే అయినా తెలంగాణ యాస మాత్రం సినిమాలో విజయ్ కు పెట్టలేదని.. బహుశా నత్తి వల్ల వర్కవుట్ కాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


[…] […]