Homeఎంటర్టైన్మెంట్Life of Pi Heroine : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన లైఫ్ ఆఫ్ పై హీరోయిన్.. లేటెస్ట్...

Life of Pi Heroine : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన లైఫ్ ఆఫ్ పై హీరోయిన్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..

Life of Pi Heroine  : ఇక ఎవెంజర్స్ లాంటి సినిమాలు తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న హాలీవుడ్ సినిమాలలో లైఫ్ ఆఫ్ పై సినిమా కూడా ఒకటి. హాలీవుడ్ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయం సాధిస్తాయి. మరివెల్ సినిమాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లైఫ్ ఆఫ్ పై సినిమా కూడా తెలుగులో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకుంది. 2001లో రచించబడిన ప్రసిద్ధ నవలగా లైఫ్ ఆఫ్ పై గుర్తింపు తెచ్చుకుంది. ఈ ప్రసిద్ధ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ నవలను ప్రముఖ రచయిత యాన్ మార్టెల్ రచించారు. అంగ్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నవల ఆధారంగా తెరకెక్కబడింది. ఒక వ్యక్తి టీనేజ్ లో జరిగిన విచిత్ర సంఘటనలు అలాగే అనుభవాలు పై లైఫ్ ఆఫ్ పై సినిమా తెరకెక్కించారు. పాండిచ్చేరిలో పై పటేల్ అనే వ్యక్తి జూ యాజమాని కొడుకు. అతను తన తల్లిదండ్రులు అలాగే తన అన్నతో కలిసి జీవనం సాగిస్తూ ఉంటాడు.

Also Read : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ ప్రస్తుతం ఎలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా..

ఆ తర్వాత కొన్ని కారణాల వలన జూలోని జంతువులతో సహా పై పటేల్ కుటుంబం మొత్తం కెనడా వెళ్లాలని అనుకుంటారు. తమ జూలో ఉన్న కొన్ని జంతువులను అమెరికాలో ఒక జూలో అమ్మేస్తారు. ఈ క్రమంలో వాళ్లు తమ జూన్ లో ఉన్న జంతువులను కెనడాకు ఓడలు తీసుకుని వెళ్లి అక్కడ అప్పగించాలని ఒక ఒప్పందం కూడా చేసుకుంటారు. పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఒక ఓడలో జంతువులను తీసుకొని ప్రయాణం చేస్తుంటారు. ఇంతలో ఒక తుఫాను కారణంగా ఆ ఓడ మునిగిపోతుంది. అప్పుడు జూ యాజమాని కొడుకు పై పటేల్ అక్కడే ఉన్న చిన్న లైఫ్ బోట్ లోకి వెళ్తాడు. పై పటేల్ తో పాటు ఒక పులి కూడా ఆ బోర్డు లోనే ఉంటుంది.

పై పటేల్ ఎలా ఆ సముద్రం నుంచి బయటపడతాడు, తర్వాత ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథ. ఈ సినిమాలో ఒక హీరోయిన్ కూడా ఉంటుంది. ఈ సినిమా మొదటి భాగంలో పై పటేల్ ఒక అమ్మాయికి ఫిదా అవడం జరుగుతుంది. జూ యజమాని కొడుకు పై పటేల్ క్లాసిక్ డాన్స్ చేసే ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. ఈ అమ్మాయి పేరు స్రవంతి సాయినాథ్. ఈ సినిమాలో టీనేజ్ యువతిగా కనిపించిన ఈ అమ్మాయి ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత స్రవంతి సాయినాథ్ మరొక సినిమాలో కనిపించలేదు అని తెలుస్తుంది. సినిమాలలో కనిపించకపోయినప్పటికీ స్రవంతి సాయినాథ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. స్రవంతి సాయినాథ్ కు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version