Leo OTT: కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన విజయ్ చిత్రాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాయి. ఆయన గత చిత్రాలు బిగిల్, మాస్టర్, బీస్ట్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న చిత్రాలే. అయినా వసూళ్లు దుమ్ముదులిపాయి. ప్లాప్ టాక్ తెచ్చుకున్న బీస్ట్ స్వల్ప నష్టాలతో బయటపడింది. ఇక లేటెస్ట్ రిలీజ్ లియో సైతం ఫస్ట్ షో నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినా కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గలేదు. ఆరూర్ రోజుల్లో లియో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో లాభాల పట్టింది. దసరా బరిలో నిలిచిన మూడు చిత్రాల్లో బ్రేక్ ఈవెన్ దాటిన ఫస్ట్ మూవీ లియో కావడం విశేషం. 2023 టాలీవుడ్ క్లీన్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దసరా విన్నర్ అంటున్నప్పటికీ భగవంత్ కేసరి ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. టైగర్ నాగేశ్వరరావు నిలకడగా వసూళ్లు రాబడుతుంది. అయితే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లేదు.
అక్టోబర్ 19న లియో విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లియో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లు సమాచారం అందుతుంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ లియో ఓటీటీ హక్కులు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో నెట్ఫ్లిక్స్ లో లియో అందుబాటులోకి రానుంది. నవంబర్ 21 నుండి లియో స్ట్రీమ్ అవుతుందని తెలుస్తుంది. అంటే నెల రోజుల్లోనే లియో ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా లియో తెరకెక్కించాడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో ముడిపడిన మూవీ లియో. పతాక సన్నివేశాల్లో దీనికి సంబంధించిన సన్నివేశాలు జోడించారు. త్రిష విజయ్ కి జంటగా నటించింది. అర్జున్, సంజయ్ దత్ వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. లియో చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. లియో విజయ్ కెరీర్లో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది.