Leo Collection: 7వ రోజు అదే ప్రభంజనం… జైలర్ కి దగ్గర్లో లియో!

ఏడవ రోజు లియో వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో రూ. 12.9 కోట్లు, కర్ణాటకలో రూ.3.4 కోట్లు, కేరళలో రూ.2.9 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.3.95 కోట్లు, ఇతర ఏరియాల నుండి రూ.3.9 కోట్లు, ఓవర్సీస్ నుండి రూ. 6 కోట్లు వసూలు చేసింది.

Written By: NARESH, Updated On : October 26, 2023 5:20 pm

Leo Collections

Follow us on

Leo Collection: దళపతి విజయ్ నటించిన లియో వసూళ్లు మ్యాజిక్ ఫిగర్ కి చేరువయ్యాయి. విజయ్ ఫ్యాన్స్ ఈ చిత్ర ఫలితం పై ఆనందంగా ఉన్నారు. అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ విడుదలైన లియో నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా లియో వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో అయితే బ్రేక్ ఈవెన్ దాటేసిన మొదటి దసరా చిత్రం అయ్యింది. దాదాపు రూ. 16 కోట్లకు లియో హక్కులు కొన్నారు. రూ. 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు సమాచారం.

ఇక ఏడవ రోజు లియో వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో రూ. 12.9 కోట్లు, కర్ణాటకలో రూ.3.4 కోట్లు, కేరళలో రూ.2.9 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.3.95 కోట్లు, ఇతర ఏరియాల నుండి రూ.3.9 కోట్లు, ఓవర్సీస్ నుండి రూ. 6 కోట్లు వసూలు చేసింది. నాలుగు రోజులకు రూ. 400 కోట్ల మార్క్ దాటిన లియో 7 రోజులకు రూ. 500 కోట్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకుందని అంటున్నారు. నిర్మాతలు ఈ మేరకు ప్రకటించారు.

అయితే ట్రేడ్ వారాల్లో కొందరు ఈ వసూళ్లను వ్యతిరేకిస్తున్నారు. అసలు లెక్కలకు నిర్మాతలు ప్రకటించే వసూళ్ళలో వ్యత్యాసం ఉందని అంటున్నారు. లియో అన్ని వందల కోట్ల వసూళ్లు రాబట్టలేదని వారి వాదన. లియో మంచి వసూళ్లు రాబట్టిందన్నది మాత్రం నిజం. అందుకు ఏపీ/తెలంగాణా రాష్ట్రాల్లో ఆ చిత్ర వసూళ్ళు నిదర్శనం. మరి లియో రూ. 50 కోట్ల మార్క్ చేరుకున్న తరుణంలో జైలర్ కి దగ్గరవుతున్నట్లు చెప్పవచ్చు.

జైలర్ లైఫ్ టైం రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. లియో సెకండ్ వీక్ లోకి అడుగుపెట్టింది. ఈ వారం చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాల వసూళ్లు లేవు. ఇది కలిసొచ్చే అంశం అనడంలో సందేహం లేదు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా లియో తెరకెక్కించాడు. విజయ్ కి జంటగా త్రిష నటించింది. అర్జున్, సంజయ్ దత్ కీలక రోల్స్ చేశారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.