Rathika Rose
Rathika Rose: బిగ్ బాస్ సీజన్ 7 రతిక రోజ్ గురించి పరిచయం అవసరం లేదు.ఆమె బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన మొదటి వారంలో పల్లవి ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడిపింది. రెండో వారంలో రివర్స్ అయింది. పవర్ అస్త్ర టాస్క్ లో ప్రశాంత్ ని నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించింది. దీంతో రతిక సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ మూటగట్టుకుంది.ఫలితంగా నాలుగో వారంలో రతిక రోజ్ ఎలిమినేట్ అయింది.ఉల్టా పుల్టా ట్విస్ట్ అంటూ రతిక ను మళ్ళీ హౌస్ లోకి తీసుకు వచ్చారు బిగ్ బాస్ టీమ్.
ఇక ఈ సారి ఫుల్ స్ట్రాటజీ తో వచ్చినట్లు తెలుస్తుంది. రావడం తోనే శివాజీ ని హగ్ చేసుకుంది. అన్న క్షమించు అంటూ డ్రామా చేసింది. శివాజీ కాళ్ళు మొక్కి మరీ క్షమాపణ కోరింది.నేను ఎలిమినేట్ అయిన షాక్ లో ఉన్నాను. అందుకే ఆ రోజు అలా మాట్లాడకుండా వెళ్ళిపోయాను. కావాలని చేయలేదు అంటూ కవర్ చేసింది.దాంతో శివాజీ పర్సనల్ ఇగోలు ఏమీ లేవు అదంతా గేమ్ లో మాత్రమే అంటూ శివాజీ చెప్పాడు.
ఇక హౌస్ ఉన్న అందరితో మాట్లాడిన రతిక ప్రశాంత్ ని మాత్రం చూసీచూడనట్లు వెళ్ళిపోయింది.చేసేదేమిలేక ప్రశాంత్ ఆమె దగ్గరికి వెళ్లి రసగుల్లా తినిపించి వెల్కమ్ చెప్పాడు.కాగా బయట ఉండి అంతా చూసి వచ్చింది. కాబట్టి బాగా క్రేజ్ ఉన్న శివాజీ టీమ్ లో చేరిపోయింది. అన్నా అన్నా అంటూ శివాజీ దగ్గర సలహాలు తీసుకుంటుంది రతిక.
ఇక ఈ వారం ఆమె ప్రవర్తన చూసి నెటిజన్లు రతిక రూట్ మార్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా అపరిచితుడు లో రేమో లా ఉండే రతిక రామూలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రతిక బిహేవియర్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇలాగే కంటిన్యూ చేస్తే టాప్ ఫైవ్ లో ఉంటుందని అంటున్నారు. కాంట్రావర్సీ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన రతిక ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి.