Leo Collection: మొదటి రోజు కలక్షన్స్ తో రజినీకాంత్ రికార్డ్ ని బ్రేక్ చేసిన విజయ్ లియో సినిమా…ఎంత వచ్చిందంటే..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత అంతటి గొప్ప క్రేజ్ ని అందుకున్న హీరో విజయ్ అనే చెప్పాలి. ఇప్పటికే విజయ్ మంచి విజయాలను అందుకున్నాడు.

Written By: Gopi, Updated On : October 20, 2023 12:33 pm

Leo Collection

Follow us on

Leo Collection: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అయితే సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన దళపతి విజయ్ గురించి మనందరికీ తెలిసిందే..ఈయన తమిళం లో చాలా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత అంతటి గొప్ప క్రేజ్ ని అందుకున్న హీరో విజయ్ అనే చెప్పాలి. ఇప్పటికే విజయ్ మంచి విజయాలను అందుకున్నాడు.

అయినప్పటికీ గత రెండు చిత్రాలు నిరశపరచడంతో ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో చేసిన లియో సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా నిన్న రిలీజ్ అవ్వడం.జరిగింది.ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడం తో ఈ సినిమా వసూళ్లు ఎంత రాబడుతుంది అనే ఒక క్యూరియాసిటి అందరిలో నెలకొంది. దీంతో లియో సినిమా నిన్న ఒక్కరోజే 115 కోట్లు వసూలు చేయడం జరిగింది. ముందుగా రజనీకాంత్ సినిమా అయిన కబాలి 105 కోట్లు కలెక్ట్ చేయగా, రోబో 2.0 సినిమా మొదటి రోజు 118 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఆ రెండు సినిమాల తర్వాత మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేసిన కోలీవుడ్ సినిమాగా ప్రస్తుతం ఈ సినిమా రికార్డును సృష్టిస్తుంది. ఇక అందులో భాగం గానే రజినీకాంత్ కబాలి సినిమా ఫస్ట్ డే రికార్డ్ ని బ్రేక్ చేసింది.ఇక ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ వసూళ్లను సాధించే అవకాశం అయితే ఉంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన డైరెక్షన్ లోని మెలుకువలతో ఈ సినిమాని చాలా వరకు రక్తి కట్టించారు.ఇక అందులో భాగంగానే ఈ సినిమాకి అన్ని కలెక్షన్స్ రావడం జరిగింది. ఇక లోకేష్ కనక రాజ్ గత చిత్రమైన విక్రమ్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

అందువల్లే ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇక దానివల్ల ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో తెలుగులో కూడా ఒక మంచి విజయాన్ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా తెలుగులో ఎంతవరకు కలక్షన్స్ ని వసూలు చేస్తుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలి.ఇక లియో సినిమా ఇప్పటివరకు మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేసిన కోలీవుడ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక దాంతో ఈ సినిమా మీద విజయ్ అభిమానులు కూడా చాలా సంతోషంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లోకేష్ కనకరాజ్, విజయ్ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన మాస్టర్ సినిమా అనుకున్న రేంజ్ లో పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో లోకేష్ కనకరాజు, విజయ్ కి ఒక హిట్ బాకీ పడిపోయాడు. అందుకోసమనే ఈ సినిమాతో ఆయనకు మంచి హిట్ ఇచ్చినట్టుగా విజయ ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు….