Lenin 6 Days Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిల్చింది. మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి , లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, అప్పుడే ఆరు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. వీకెండ్స్ తర్వాత డ్రాప్స్ వచ్చినప్పటికీ , 4వ రోజు ,5వ రోజు వసూళ్లు చాలా స్టడీ గా ఉండడం తో , లాంగ్ రన్ ఇరగకుమ్మేస్తుందని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే 6 వ రోజు వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఇది చూసిన తర్వాత ఈ వీకెండ్ వచ్చే వసూళ్లే ఈ సినిమాకు ఫైనల్ అనుకోవచ్చు , ఆ తర్వాత భారీ వసూళ్లు రావడం దాదాపుగా కష్టమే అని అంటున్నారు. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 6 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 37 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ప్రాంతాల వారీగా 6 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దాం.
నైజాం ప్రాంతం నుండి 9 కోట్ల 89 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల 79 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర నుండి 3 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, ఈస్ట్ గోదావరి నుండి 2 కోట్ల రూపాయిలు , వెస్ట్ గోదావరి నుండి 1 కోటి 28 లక్షల రూపాయిలు , గుంటూరు నుండి 1 కోటి 88 లక్షలు , కృష్ణ జిల్లా నుండి 1 కోటి 41 లక్షలు , నెల్లూరు నుండి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 23 కోట్ల 19 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 38 కోట్ల 85 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1 కోటి 95 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి 28 కోట్ల 64 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 51 కోట్ల 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రేపటితో ఈ చిత్రం 30 కోట్ల షేర్ క్లబ్ లోకి చేరనుంది. అదే విధంగా నైజాం ప్రాంతం పంతం లో నేటితో 10 కోట్ల మార్కు ని అందుకోనుంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం 40 కోట్ల షేర్ మార్కుని అందుకుంటుందో లేదో చూడాలి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 6 కోట్ల 64 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎంత లాభాలు వస్తాయో చూడాలి.
