
Sunil as Mangalam Srinu: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా నుంచి సునీల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే, ఈ లుక్ పై పాజిటివ్ టాక్ కంటే.. నెగిటివ్ టాకే ఎక్కువగా వినిపిస్తోంది. మెయిన్ గా ఈ ఫస్ట్ లుక్ పూర్తిగా ఆర్టిఫిషియల్ గా కనిపిస్తోందని.. ఏదో ఫోటో షాప్ లో ఎడిట్ చేసినట్టు ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
పాపం సునీల్ మాత్రం సీరియస్ గా కనిపించడానికి తెగ కష్టపడినట్టు ఉన్నాడు. తీక్షణమైన చూపులు చూస్తూ, కళ్లలో క్రోధాన్ని చూపించడానికి తెగ తాపత్రయ పడ్డాడు. అయితే, సునీల్ కళ్ళను గాజు కళ్లగా మార్చారు. అలాగే గోల్డ్ షేడ్ ఖద్దరు చొక్కాకు ఓవర్ కలరింగ్ ఇచ్చారు. ఇక చేతికి వాచీ, మెడ నిండా గోల్డ్ సిల్వర్ చైన్స్, చేతి వేళ్లకు ఉంగరాలు ఇవన్నీ సహజంగా లేకపోవడం కూడా ఫస్ట్ లుక్ ఆర్టిఫిషియల్ గా కనిపించడానికి కారణం అయింది.
మొత్తానికి సునీల్ లో విలన్ కన్నా, డిఫెరెంట్ కమెడియనే ఎక్కువగా హైలైట్ అయ్యాడని అంటున్నారు నెటిజన్లు. పైగా ఈ లుక్ ఎక్కడో చూసినట్లు ఉందని కూడా ఫీల్ అవుతున్నారు. ఏది ఏమైనా లుక్ ఎంత వైలెంట్ గా ఉన్నా.. చివరకు కామెడీ అయింది. దీనికితోడు సునీల్ వాయిస్ వినగానే కామెడీ అనుకునే ప్రేక్షకులు, సినిమాలో సునీల్ సీరియస్ గా డైలాగ్ లు చెబుతుంటే పంచ్ లు అనుకుంటారేమో.
మొత్తమ్మీద ఈ సీరియస్ లుక్ సునీల్ కు సూట్ అవ్వలేదు అంటూ సోషల్ మీడియాలో సుకుమార్ ను ఆడేసుకుంటున్నారు బన్నీ యాంటీ ఫ్యాన్స్. పుష్ప బాక్సాఫీస్ వద్ద తేలిపోవడం ఖాయం అని శాపనార్ధాలు కూడా పెడుతున్నారు. సునీల్ ఫస్ట్ లుక్ కాస్త.. ఫైనల్ గా పుష్పకు టార్చర్ అయింది. అయినా సునీల్ కమెడియన్ గా బాగా ముద్ర పడిపోయాడు.
అలాంటి వ్యక్తిని విలన్ గా చూపిస్తే ఎంత వరకు వర్కౌట్ అవుతుంది ? కమెడియన్ గా రాణించిన సునీల్…విలన్ పాత్రకు అసలు న్యాయం చేయలేడనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ సారి లెక్కల మాస్టర్ సుకుమార్ లెక్క తప్పడం ఖాయం అని టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.