https://oktelugu.com/

Aryan Drug case: షారుఖ్​ ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడు!

Aryan drug case: ముంబయి క్రూయిజ్​ డ్రగ్స్​ కేసుపై రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్​ మాలిక్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్యన్​ ఖాన్​ను కిడ్నాప్​ చేసి రూ. 25 కోట్లు ఇస్తే విడిచిపెడతామని డిమాండ్​ చేసినట్లు నవాబ్​ మాలిక్​ ఆరోపించారు. అన్నీ వాళ్లు అనుకున్నట్లు జరిగినప్పటికీ.. ఒక్క గోసవీ తీసుకున్న ఒక్క సెల్ఫీతో గేమ్​ మొత్తం మారిపోయిందని పేర్కొన్నారు. నిజానికి ఆరోజు జరిగిన డ్రగ్స్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 7, 2021 6:15 pm
    maharastra-minister-navab-malik-sensational-comments-on-aryan-khan-drug-case
    Follow us on

    Aryan drug case: ముంబయి క్రూయిజ్​ డ్రగ్స్​ కేసుపై రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా, ఈ విషయంపై మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్​ మాలిక్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్యన్​ ఖాన్​ను కిడ్నాప్​ చేసి రూ. 25 కోట్లు ఇస్తే విడిచిపెడతామని డిమాండ్​ చేసినట్లు నవాబ్​ మాలిక్​ ఆరోపించారు. అన్నీ వాళ్లు అనుకున్నట్లు జరిగినప్పటికీ.. ఒక్క గోసవీ తీసుకున్న ఒక్క సెల్ఫీతో గేమ్​ మొత్తం మారిపోయిందని పేర్కొన్నారు. నిజానికి ఆరోజు జరిగిన డ్రగ్స్​ పార్టీకి ఆర్యన్​ ఖాన్​ తనంతట తాను రాలేదని అన్నారు. ఈ కుట్రకు భాజపా నేత మోహిత్​ భారతీయ ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు.

    https://twitter.com/editorji/status/1457259922928795654?s=20

    నిజానికి ఈ కేసును మొదట్లో దర్యాప్తు చేసిన ఎన్సీబీ అధికారి సమీర్​ వాంఖడే, మోహిత్​ షారుఖ్​ను డబ్బు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఆర్యన్​ ఖాన్​ అరెస్టైన తొలిరోజే షారుఖ్​కు బెదిరింపులు వెళ్లాయని అన్నారు. ఇప్పటికీ వీటి గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని షారుఖ్​ను బెదిరిస్తున్నట్లు నవాబ్ మాలిక్​ ఆరోపించారు. కనీసం ఇప్పటికైనా షారుఖ్​ బయటకు వచ్చి మాట్లాడితే కానీ.. సమస్యలు పరిష్కారం కావని అన్నారు.  కాగా, నవాబ్ మాలిక్​ వాంఖడేపై వరుస ఆరోపణలు చేస్తున్న క్రమంలో.. ఈ కేసు దర్యాప్తు నుంచి ఎన్సీబీ జోనల్​ డైరెక్టర్​ సమీర్​ వాంఖడను తప్పిస్తున్నట్లు డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. అతని స్థానంలో సంజయ్​ సింగ్​ను విచారణ నిమిత్తం నియమించారు. వాంఖడేను ఢిల్లీలో ఎన్సీబీ కేంద్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఇకపై ఆర్యన్‌ఖాన్‌ కేసు సహా మొత్తం ఆరు డ్రగ్‌ కేసులను సంజయ్‌ సింగ్‌ నేతృత్వంలో ఎన్‌సీబీ సెంట్రల్‌ యూనిట్‌ దర్యాప్తు చేయనుంది.సమీర్‌ వాంఖడే చుట్టూ ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి.