https://oktelugu.com/

బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ మృతి

బాలీవుడ్‌ను విషాదాలు వెంటాడుతున్నాయి. చిత్ర పరిశ్రమ వరుసగా పలువురు ప్రముఖులను కోల్పోతోంది. రిషీ కపూర్, ఇర్ఫాన్‌ ఖాన్, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణాలను మరచిపోకముందే ఇండస్ట్రీలో మరోసారి విషాదం అలముకుంది. దివంగత శ్రీదేవి, అలనాటి అద్భుత నటి మాధురి దీక్షత్‌ వంటి స్టార్స్‌కు నృత్యం నేర్పించి. ‘ది మదర్ ఆఫ్ డ్యాన్‌’గా పేరొందిన ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ ఇకలేరు. తీవ్రమైన గుండెపోటు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె […]

Written By:
  • admin
  • , Updated On : July 3, 2020 5:16 pm
    Follow us on


    బాలీవుడ్‌ను విషాదాలు వెంటాడుతున్నాయి. చిత్ర పరిశ్రమ వరుసగా పలువురు ప్రముఖులను కోల్పోతోంది. రిషీ కపూర్, ఇర్ఫాన్‌ ఖాన్, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణాలను మరచిపోకముందే ఇండస్ట్రీలో మరోసారి విషాదం అలముకుంది. దివంగత శ్రీదేవి, అలనాటి అద్భుత నటి మాధురి దీక్షత్‌ వంటి స్టార్స్‌కు నృత్యం నేర్పించి. ‘ది మదర్ ఆఫ్ డ్యాన్‌’గా పేరొందిన ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ ఇకలేరు. తీవ్రమైన గుండెపోటు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కూతురు వెల్లడించారు. 71 ఏళ్ల సరోజ్‌ ఖాన్‌ కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి చికిత్స తీసుకునేందుకు రెండు వారాల కిందట ముంబై బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. కరోనా అనుమానంతో పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్‌ అని తేలింది. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే ఉంచి ఆమెకు చికిత్స అందించారు. ఆరోగ్యం మెరుగవడంతో డిశ్చార్జ్‌ చేశారు. కానీ శుక్రవారం ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె మృతి చెందారు. ఈ విషయం సరోజ్ అభిమానుల్లో విషాదం నింపింది. శుక్రవారమే స‌రోజ్ ఖాన్ అంత్యక్రియలు జరగనున్నాయి. సరోజ్ మృతదేహాన్ని మలాద్ లోని అహ్లే సున్నత్ శ్మశానానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1961లో సోహన్‌ లాల్‌ను పెళ్లి చేసుకున్న సరోజ్‌.. నాలుగేల్ల తర్వాత ఆయనతో విడిపోయింది. ఆపై, 1975లో సర్దార్ రోషన్‌ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు.

    పవన్,లోకేష్ లలో పాదయాత్ర ఎవరికి వర్కౌట్ అవుతుంది?

    భారత చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నృత్య దర్శకులు ఉన్నా.. సరోజ్‌ ఖాన్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లేడీ కొరియోగ్రాఫర్ నుంచి లెజెండరీ కొరియోగ్రాఫర్ అనే స్థాయికి ఎదిగారు. 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దాదాపు 200కు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. రెండు వేల పైచిలుకు పాటలకు నృత్యరీతులు సమకూర్చారు. శ్రీదేవి సూపర్‌ హిట్‌ మూవీ నాగిని, మిస్టర్ ఇండియా ఆమెకు మంచి పేరు తెచ్చాయి. అంతేకాదు సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ లోని ‘ డోలా రే డోలా’, మాధురి దీక్షిత్-నటించిన తేజాబ్‌లోని ‘ ఏక్ దో తీన్’, 2007లో వచ్చిన జబ్ వి మెట్‌లో ‘యే ఇష్క్ హాయే’ సహా మరెన్నో పాటలకు అద్భుత నృత్యం అందించారు. సహా ఎన్నో మరపురాని పాటలకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. దేవదాస్‌లోని ‘డోలా రె డోలా’, జబ్‌ వి మెట్‌లో ‘యే ఇష్క్‌ హాయె’తో టు శ్రీంగారం అనే తమిళ్ మూవీల అన్ని పాటలకు ఆమె బెస్ట్‌ కొరియోగ్రాఫర్గా మూడుసార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. తెలుగులోకూడా పలు చిత్రాలకు ఆమె పని చేసింది. మరో 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆమెను వరించాయి. చిరంజీవి.. చూడాలని ఉంది సినిమాకు బెస్ట్‌ కొరియోగ్రాఫర్గా నంది పురస్కారం అందుకున్నారు. సరోజ్‌ ఖాన్‌ మంచి రచయిత కూడా. 12 చిత్రాలకు రచయితగా వ్యవహరించారు.