మలయాళంలో ‘లూసిఫర్’ సూపర్ హిట్ అయిన మాట నిజమే. కానీ మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ చేయాల్సిన మూవీనా అంటే అది అనుమానమే. మోహన్ లాల్ కే ఆ సినిమా కథ చిన్నగా అనిపించింది. అలాంటిది ఇక మెగాస్టార్ కి ఎలా ఉంటుంది. అందుకే చిరు కోసం స్క్రిప్ట్ లో మార్పులు చేశారు. క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కీలకమైనది. ఒకరకంగా సెకెండ్ హీరో రేంజ్ క్యారెక్టర్ అది. అందుకే మొదట ఆ పాత్రలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిజానికి బన్నీ కూడా ఆ పాత్ర చేయడానికి ఇంట్రస్ట్ గానే ఉన్నాడని కూడా మెగాఫ్యామిలీ సన్నిహితులు బాహాటంగానే స్పందించారు. కానీ తక్కువ నిడివి గల ఆ పాత్ర బన్నీ కి సూట్ అవ్వదని మెగాస్టార్ ఫీల్ అవుతున్నారట.
పవన్,లోకేష్ లలో పాదయాత్ర ఎవరికి వర్కౌట్ అవుతుంది?
అందుకే ఆ పాత్రలో ఇప్పుడు మరో హీరో కనిపించబోతున్నాడు. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, మెగాస్టార్ అనుచరుడి పాత్రలో కనిపించనున్నారు. విజయ్ దేవరకొండ ఆ పాత్రలో బాగుంటాడు. పైగా విజయ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సో.. ఏ రకంగా చూసుకున్న విజయ్ నే బెస్ట్ అప్షన్. ఇక ఈ రీమేక్ ను దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనదే. కాగా తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో ఎమ్మెల్యే రోజా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మెగా బృందం నుంచి అధికారిక ప్రకటన రావాలి.
రీ ఎంట్రీకి సిద్ధమవుతున్న టిక్ టాక్..?
అన్నట్టు తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి కొన్ని కీలకమైన మార్పులను సూచించగా.. సుజీత్ రైటర్ సాయి మాధవ్ తో కలిసి ఆ మార్పులను పూర్తి చేసి చిరుకి ఫుల్ స్క్రిప్ట్ చెప్పడం, లేటెస్ట్ వెర్షన్ మెగాస్టార్ కి బాగా నచ్చడంతో, టోటల్ సినిమా స్క్రిప్ట్ కి శుభం కార్డు వేసేశారు. అయితే సినిమాలో హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సన్నివేశాల టేకింగ్ లో మెహర్ రమేష్ కూడా వర్క్ చేయబోతున్నారట.