Leak On Jailor Movie Story: తలైవా రజినీకాంత్ తన స్థాయి హిట్ అందుకొని చాలా కాలం అవుతుంది. 2.0 తర్వాత ఆ రేంజ్ కమర్షియల్ హిట్ ఆయనకు పడలేదు. ఆయన గత మూడు చిత్రాలు పేట, దర్బార్, అన్నాత్తే ఏమంత ప్రభావం చూపలేకపోయాయి. తమిళంలో ఓ మోస్తరు విజయాలు నమోదు చేసినప్పటికీ తెలుగులో నిరాశపరిచాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న రజినీకాంత్ కి తెలుగులో కూడా భారీ మార్కెట్ ఉంది. వరుస పరాజయాలతో ఆయన మార్కెట్ పడిపోతూ వస్తుంది. ఇక్కడి స్టార్స్ తో సమానంగా రజినీకాంత్ సినిమాలకు ఓపెనింగ్స్ దక్కేవి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు.
ఇక రజినీకాంత్ రాజకీయ ప్రవేశం చేసి సినిమాలకు గుడ్ బై చెబుతారని ఫ్యాన్స్ నమ్మారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజినీకాంత్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అనూహ్యంగా ఎన్నికలకు ముందు రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటించారు. దేవుని ఆదేశం మేరకే ఈ నిర్ణయం అంటూ సమర్ధించుకున్నారు. ఫ్యాన్స్ ఎంత డిమాండ్ చేసినా రజినీకాంత్ తన నిర్ణయం మార్చుకోలేదు. ఈ క్రమంలో ఆయన అభిమానుల కోసం వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా రజినీకాంత్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో మూవీ ప్రకటించారు. రజినీకాంత్ 169 వ చిత్రంగా తెరకెక్కుతుండగా జైలర్ అనే టైటిల్ నిర్ణయించారు. ఈ మాస్ టైటిల్ రజినీకాంత్ ఇమేజ్ కి సరిపోయేలా ఉంది. జైలర్ టైటిల్ పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Pooja Hegde: బ్రా లేదు పైగా బటన్స్ తీసేసింది… పూజా అందాల అరాచకానికి క్రేజీగా ఫీల్ అవుతున్న ఫ్యాన్స్!
కాగా జైలర్ స్టోరీ లైన్ లీక్ అయ్యింది. దీనికి సంబంధించి కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. కరుడుగట్టిన కొందరు గ్యాంగ్ స్టర్స్ జైలులో ఉంటారు. వాళ్ళు జైలు నుండి తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేస్తారు. అక్కడ జైలర్ గా ఉన్న రజినీకాంత్ ఆ గ్యాంగ్ స్టర్స్ ని ఎలా ఎదుర్కొన్నాడు? వాళ్ళ ప్లాన్ ఎలా భగ్నం చేశాడు? ఈ క్రమంలో జైలర్ కి ఎదురైన ఇబ్బందులు ఏంటీ? అనేది మొత్తంగా సినిమా స్టోరీ లైన్ అట. హీరో ఎలివేషన్స్ తో పాటు మాస్ కమర్షియల్ అంశాలకు మంచి స్కోప్ ఉన్న జైలర్ మూవీ సరిగా కుదిరితే రజినీకాంత్ భారీ ఇండస్ట్రీ హిట్ నమోదు చేయడం ఖాయం అంటున్నారు.
సన్ పిక్చర్స్ జైలర్ చిత్రాన్ని నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక డాక్టర్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు నెల్సన్ బీస్ట్ విషయంలో తడబడ్డాడు. విజయ్ క్రేజ్ రీత్యా తమిళంలో చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించిన ఈ మూవీలో తెలుగులో ఆడలేదు. బీస్ట్ విడుదలకు ముందే రజినీకాంత్ తో మూవీ ప్రకటించారు. నెల్సన్ కెరీర్ కి రజినీకాంత్ మూవీ చాలా కీలకం.
Also Read:Deepika Padukone: దీపికా పై వస్తున్న ఆ పుకార్లు నమ్మొద్దు… నష్ట నివారణ చర్యల్లో నిర్మాత అశ్వినీదత్